/rtv/media/media_files/2025/02/26/Ntbiz7OcjAJGMhqVfxgC.jpg)
Bangladeshi girls for rent in India
Girls for rent: నగరం నడిబొడ్డున అమ్మాయిల అమ్మకం దందా యధేచ్చగా నడుస్తోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అవసరాలను ఆసరా చేసుకొని కొంతమంది కేటుగాళ్లు అమాయకులకు వలవేసి అంగట్లో అద్దెకు పెడుతున్నారు. వయసు, అందం ఆధారంగా ధర కట్టి అమ్మేస్తున్నారు. అయితే వీరంతా బంగ్లాదేశ్ అమ్మాయిలే కాగా.. భారత ఏజెంట్ల సహాయంతో బంగ్లా వ్యాపారులు ప్రధాన నగరాలకు చేరవేస్తున్నారు. ఇటీవల కోల్‌కతా నగరంలో మహిళల అక్రమ రవాణా రాకెట్‌ను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించగా భయంకర నిజాలు బయటకొచ్చాయి.
ఒకేసారి 40 మంది యువతులు..
ఈ మేరకు 3 మైనర్లు, 4 యువతులను ఏజంట్లనుంచి కాపాడిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారించగా దందా గురించి మొత్తం బయటపెట్టారు. ఇది కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు ఒప్పుకున్నారు. బంగ్లా-భారత్ సరిహద్దుల నుంచి రహస్యంగా పశ్చిమబెంగాల్‌కు చేరవేస్తారు. అక్కడ ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి అప్పగిస్తారు. 2 ఏళ్లలో బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందిన 40 మంది యువతులు, 10 మంది మైనర్లను వ్యభిచార కూపం నుంచి బయటపడేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మరో 50 మంది కొత్తగా వస్తున్నట్లు గుర్తించి వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
డేటింగ్ యాప్‌ల్లో రూ. 2లక్షలు..
పశ్చిమబెంగాల్ ఉంటున్న కొంతమది బంగ్లాదేశీయులు స్థానికులుగా చెప్పుకుంటూ ఈ దందా చేస్తున్నారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్‌లోని దళారుల సాయంతో మానవ అక్రమ రవాణా నడిపిస్తున్నారు. పేద కుటుంబాలే వీరి టార్గెట్. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఆశచూపిస్తారు. సరిహద్దు గ్రామాలు, చెరువులు, సొరంగ మార్గాల ద్వారా పశ్చిమబెంగాల్ చేరవేస్తారు. మైనర్లకు రూ.20వేలు, యువతులకు రూ.35వేలు అడ్వాన్స్ ఇచ్చి తీసుకొస్తారు. ఇండియాలో విలాసవంతమైన జీవితం గడపొచ్చని చెప్పి నమ్మించి మోసం చేస్తారు. మొదట బ్యూటీపార్లర్, మసాజ్ సెంటర్, హోటళ్లలో పని కల్పించి ఆ తర్వాత వ్యభిచార గృహంలో అమ్మేస్తారు. కోల్‌కతాలోనే వారికి నకిలీ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు ఇస్తారు. వీరికి ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, విశాఖపట్నం నగరాల్లో భారీ డిమాండ్ ఉంది. డేటింగ్ యాప్‌ల్లోనూ వీరి ఫొటోలు పెట్టి రూ. 2లక్షలు వరకు డిమాండ్ చేసి అమ్మేస్తుంటారని పోలీసులు వెల్లడించారు.
Also Read : మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే