/rtv/media/media_files/2025/02/06/0Canc39g94RbCQQr3W43.jpg)
Husband Allegedly Leaks Wife's Private Photos
అహ్మదాబాద్ (Ahmadabad) లోని మేమ్‌నగర్ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య విడాకులు అడిగిందని ఆమె భర్త భార్య ప్రైవేటు ఫొటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. 21 ఏళ్ల బాధితురాలకి ఏడాది క్రితం వడోదరకు చెందిన యువకుడితో వివాహం జరిగింది. తన కుటుంబంతో మేమ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తూ.. ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుంది.
Also Read : శ్మశానవాటికలో బీజేపీ లీడర్.. బిచ్చం ఎత్తుకునే వరకు తీసుకొచ్చిన రాజకీయాలు
కొన్ని నెలలు తన అత్తమామలు, భర్తతో గొడవలు జరగడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె భర్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ (Instagram Account) ను యాక్సెస్ చేస్తున్నాడు. అయితే ఇద్దరు ఓ సారి వీడియో కాల్‌లో కాంటాక్ట్ అయ్యారు. తాను ఎదుర్కొంటున్న స్కిన్ అలెర్జీ సమస్య గురించి ఆమె వీడియో కాల్ ద్వారా తన భర్తకు చూపించింది. అయితే దానిని అతడు రికార్డు చేశాడు.
Also Read : విజయ్ తో తమన్నా బ్రేకప్?
విడాకులు కావాలని అడగడంతో
చాలాకాలంగా భార్యభర్తలు దూరంగా ఉండటంతో తనకు విడాకులు (Divorce) కావాలని బాధితురాలు తన భర్తకు తెగేసి చెప్పింది. అయితే భార్యాభర్తలిద్దరూ ఒకే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించడం, దాని పాస్‌వర్డ్ ఆ మహిళ భర్త వద్ద కూడా ఉండటంతో... భార్యపై ప్రతీకారంతో ఆమె ప్రైవేట్ వీడియోలను వాట్సాప్ స్టేటస్ తో పాటుగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్‌లోడ్ చేశాడు ఆమె భర్త.
Also Read : ఈ రాశుల వారికి ఈరోజు అన్నీ వృథా ఖర్చులే..తగ్గించుకుంటే బెటర్!
బయటి వ్యక్తుల నుంచి ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు వెంటనే తన భర్తపై ధట్లోడియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 351 (2), 356 (2), ఐటీ చట్టంలోని సెక్షన్లు 66 (ఇ), 67 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె భర్త పరారీలో ఉన్నాడు.
Also read : Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!