Revanth Reddy: రేవంత్‌ను సీఎం చేయొద్దు.. సీనియర్లు బలంగా వినిపిస్తున్న 5 వాదనలు ఇవే! తెలంగాణకు రేవంత్‌ను సీఎం చేయొద్దని పలువురు సీనియర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. మల్కాజ్‌గిరి ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదని.. తమ జిల్లాల్లో ఒక్కచోట మినహా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని చెబుతున్నారు. తాము రేవంత్ కంటే అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిచామంటున్నారు. By B Aravind 05 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన అనంతరం ముఖ్యమంత్రి ఎవరూ అనే అంశంపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. ఇప్పటికే మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ కొంతమంది సీనియర్లు మాత్రం రేవంత్‌కు సీఎం పదవి అప్పగించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం పదవికి తమ పేర్లు కూడా పరిశీలించాలని కోరుతున్నారు. అయితే రేవంత్‌ను సీఎం చేసేందుకు అడ్డుకునేందుకు ఈ సీనియర్ నేతలు కొన్ని వాదనలు కూడా చెబుతున్నారు. రేవంత్ ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నారని.. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్నారు. అక్కడ ఒక్క సూర్యాపేట తప్ప మిగతా అన్ని నియోజవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలాగే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నారు. అక్కడ కూడా జనగామ మినహా.. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. తమ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ను గెలిపించామని.. కానీ రేవంత్ ప్రాతినిధ్యం వహించే మల్కాజ్‌గిరి ప్రాంతంలో కాంగ్రెస్‌ను గెలిపించలేకపోయారని వాదిస్తున్నారు. Also read: కాస్త తేరుకున్న చెన్నై.. విమాన రాకపోకల పునరుద్ధరణ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తమతో పాటు అనేక మంది అభ్యర్థులు 50 వేలకు పైగా మెజార్టీ ఓట్లతో ఎన్నికల్లో గెలిచారని.. రేవంత్ తమ కంటే తక్కువగా 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని అంటున్నారు. గతంలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్.. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం రెండు కార్పొరేటర్లను మాత్రమే గెలిపించుకోగలిగారని చెబుతున్నారు. రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చి కనీసం పదేళ్లు కూడా కాలేదని.. కానీ తాము ఎన్నో ఏళ్లుగా పార్టీకి విధేయులుగా ఉంటున్నామని అంటున్నారు. ఇంకా సీఎం కేసీఆర్ పై బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి కామారెడ్డిలో మూడో స్థానంలో నిలిచారన్న విషయాన్ని వివరిస్తున్నారు. ఇలాంటి వాదనలతో రేవంత్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అర్హత లేదని పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. నిన్ననే (సోమవారం) డికే శివకుమార్ బృందం అక్కడికి వెళ్లింది. ఈరోజు మధ్యాహ్నం వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమవుతారు. అయితే ఈరోజు సాయంత్రం నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేస్తామని ఖర్గే మీడియాతో తెలిపారు. అయితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ఉత్కంఠకు ఈరోజు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. Also read: మిచౌంగ్ ఎఫెక్ట్..హైదరాబాద్ లో మొదలైన వాన! #telugu-news #telangana-news #revanth-reddy #uttam-kumar-reddy #komati-reddy-venkat-reddy #batti-vikramarka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి