BIG BREAKING: NTVపై సీఎం రేవంత్ సీరియస్.. లైసెన్స్ రద్దు చేయాలంటూ ఆదేశం
NTV వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఆ ఛానల్ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర సమాచార శాఖకు లేఖ రాయాలని ఆదేశాలు జారీ చేశారు.
NTV వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఆ ఛానల్ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర సమాచార శాఖకు లేఖ రాయాలని ఆదేశాలు జారీ చేశారు.
తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చే స్టేజీలో తను లేనని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పార్టీ పెద్దలు మాటిచ్చిన విషయం తనకు తెలియదన్నారు. మంత్రిపదవుల విషయంలో హైకమాండ్, ముఖ్యమంత్రిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
ముగ్గురు సీనియర్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖలకు జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు నుంచి తొలగించారు. వారి స్థానంలో కొత్త మంత్రులకు జిల్లా ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రతీ గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు.
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు NHAI గుడ్ న్యూస్ చెప్పింది. ఖమ్మం-సూర్యాపేట రోడ్డు హైదరాబాద్-విజయవాడ హైవేను కలిసే ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. దీంతో ఖమ్మం నుంచి వచ్చే వాహనదారులు యూటర్న్ కోసం 2 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం ఉండదు.
బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందంటూ కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, అందుకు సార్వత్రిక ఎన్నికలే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారు. కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారంటూ విమర్శలు చేశారు.
జాతీయ రహదారులు,రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రం 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు.
ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మరో 5 వేల ఉద్యోగాలు ఇందులో జోడించనుంది.
రోడ్ల నిర్మాణంలో అలసత్వానికి తావు ఉండకూడదని మంత్రి కోమటిరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని మాటిచ్చామని అందుకోసం పనులు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.