Vishnu Priya: విష్ణు ప్రియకి కలిసొచ్చిన కేసు.. ఇన్‌స్టాలో నెలకు రూ.11 లక్షలు లాభం!

ప్రస్తుతం డిజిటల్ యుగంలో వివాదాలే పెట్టుబడిగా మారుతున్నాయి. ఒకరిని విమర్శిస్తూ చేసే ప్రచారం, పరోక్షంగా వారికే భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. బుల్లితెర పాపులర్ యాంకర్ విష్ణుప్రియ భీమినేని కేసు ఇప్పుడు ఇందుకు సాక్ష్యంగా నిలిచింది.

New Update
Vishnu Priya

ప్రస్తుతం డిజిటల్ యుగంలో వివాదాలే పెట్టుబడిగా మారుతున్నాయి. ఒకరిని విమర్శిస్తూ చేసే ప్రచారం, పరోక్షంగా వారికే భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. బుల్లితెర పాపులర్ యాంకర్ విష్ణుప్రియ(vishnu priya videos) భీమినేని కేసు ఇప్పుడు ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఆమెపై నమోదైన పోలీసు కేసు, ఆమె పర్సనల్ ప్లాట్‌ఫారమ్ ఆదాయాన్ని ఊహించని రేంజ్‌కు తీసుకెళ్లింది.

Also Read :  తగ్గేదేలే..! బికినీ ఫొటోలతో హీటేక్కిస్తున్న బొద్దుగుమ్మ

వివాదం ముందు.. ఆ తర్వాత..

విష్ణుప్రియ(Anchor Vishnupriya) తన పర్సనల్ యాప్/ప్లాట్‌ఫారమ్‌లో పెట్టే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం ఒక్కో సబ్‌స్క్రైబర్ నుండి సుమారు రూ.380 వసూలు చేస్తారు. కేసు నమోదుకు ముందు సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1,892. అప్పుడు ఆమె నెలవారీ ఆదాయం సుమారు రూ.7,18,960 ఉండే. తర్వాత ఎప్పుడైతే విజయవాడలో AISF నాయకులు ఆమె కంటెంట్‌లో అశ్లీలత ఉందంటూ ఫిర్యాదు చేశారో, అప్పటి నుండి సీన్ రివర్స్ అయ్యింది. మీడియాలో జరిగిన చర్చ ఆమెకు నెగటివ్ కంటే ఎక్కువ క్యూరియాసిటీని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఏకంగా 4,832 కి చేరింది. దీంతో ఆమెకు ప్రస్తుత ఆదాయం అక్షరాలా రూ.18,36,160 వస్తున్నాయి. అంటే కేవలం ఒక్క వివాదం వల్ల ఆమె నెలవారీ ఆదాయం అదనంగా రూ.11 లక్షలకు పైగా పెరగడం గమనార్హం.

సాధారణంగా నైతిక విలువలను కాపాడాలని, తప్పుడు కంటెంట్‌ను అడ్డుకోవాలని సంస్థలు కేసులు పెడతాయి. కానీ డిజిటల్ ప్రపంచంలో ఒక కంటెంట్‌ను ఎంతగా అడ్డుకోవాలని చూస్తే, దానిపై జనాభాలో అంతగా ఆసక్తి పెరుగుతుంది. విష్ణుప్రియ(Vishnu Priya Case) విషయంలోనూ ఇదే జరిగింది. పబ్లిసిటీ కోసం లక్షలు ఖర్చు చేసినా రాని రీచ్, ఈ కేసు ద్వారా ఆమెకు 'ఫ్రీ'గా లభించింది. ఫలితంగా కొత్త కస్టమర్లు ఆమె ప్లాట్‌ఫారమ్‌కు క్యూ కట్టారు. ఈ మొత్తం సీన్‌లో ఆర్థికంగా విష్ణుప్రియ లాభపడగా, ఇక్కడ నష్టపోతున్నది మాత్రం సమాజంలోని నైతిక విలువలే అని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..? 90's కుర్రాళ్ల కలలరాణి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

Advertisment
తాజా కథనాలు