Chhaava Box Office Collections: రష్మిక నటించిన ఛావా సినిమాకు రికార్డ్ కలెక్షన్స్

శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన హిస్టారికల్ మూవీ ఛావా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. విక్కీ కౌశల్, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. 

New Update
cinema

Chhava Movie

Chhaava Box Office Collections: ఛత్రపతి శివాజీ(Chatrapathi Shivaji) ఎంత ఫేమస్సో...ఆయన కుమారుడు శంభాజీ(Shambhaji) కూడా అంతే ఫేమస్. బ్రిటీష్ వారితో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న ఈతని చరిత్రను సినిమాగా మలిచారు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్(Bollywood Vicky Kaushal) శంభాజీగా..రష్మిక(Rashmika Mandanna) అతని భార్యగా ప్రధాన పాత్రల్లో నటించిన ఛావా సినిమా ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనే 5 లక్షల టికెట్స్‌ బుక్ అవ్వగా..మొదటిరోజు రూ.31 కోట్లు వసూలుచేసినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్ మొదటి రోజు రూ.15.30 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఛావా దాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన సినిమాగా ఛావా నిలిచింది. 

Also Read:  Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?

Also Read :  వల్లభనేని వంశీ అరెస్ట్‌..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!

పాత్రలకు జీవం పోసిన విక్కీ, రష్మిక...

ఇక సినిమా విషయానికి వస్తే హిస్టారికల్ మూవీ ఛావా అదరగొట్టిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో సినిమా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మామూలుగానే విక్కీ కౌశల్ తాను చేసిన పాత్రల్లో జీవిస్తాడు. ఇందులో శంభాజీగా మరింత జీవం పోశాడని చెబుతున్నారు. అతని భార్యగా రష్మిక కూడా పాత్రకు ప్రాణం పోసిందని చెబుతున్నారు. సినిమాలో చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందని రివ్యులు వస్తున్నాయి. అలాగే ఛావా సినిమాలో నటించిన అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు  ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్‌!

Also Read: Bihar: గురుదక్షిణగా..గర్ల్ ఫ్రెండ్ గా ఉండు...విద్యార్థినికి టీచర్ వేధింపులు

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు