/rtv/media/media_files/2025/03/20/LbZ5L9r55tIAcwA0lRrC.jpg)
Vijay Deverakonda Team Responds To FIR Amid Illegal Betting Apps Controversy
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్లతో పాటు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అందులో విజయ్‌దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, నిధి అగర్వాల్, మంచులక్ష్మి, అనన్య నాగల్ల, ప్రణీత, శ్రీముఖి, సిరి హనుమంతు, నయని పావనిపై కేసు నమోదు చేశారు. బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు మొత్తం 25 మందిపై కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది.
Also Read: ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!
విజయ్ టీం క్లారిటీ
అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో విజయ్ దేవరకొండ పై కూడా కేసు నమోదు అయిందన్న ప్రచారంపై హీరో టీం స్పందించింది. ఈ మేరకు దేవరకొండ టీమ్ క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని తెలిపింది. అంతేకాకుండా ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ వెల్లడించింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అప్రువల్ ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని టీమ్ క్లారిటీ ఇచ్చింది.
Also Read: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని కేసు నమోదు చేయడంపై స్పందించిన విజయ్ దేవరకొండ టీం
— Telugu Scribe (@TeluguScribe) March 20, 2025
చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రకటనలు చేశాడు
విజయ్ దేవరకొండ అనుమతి ఉన్న A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్… https://t.co/wrr3Fi2vG6 pic.twitter.com/wsGAV8IwME
Also Read: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ
Also read : హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు
అయితే ఈ A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ డీల్ గతేడాదితో ముగిసిందని తెలిపింది. ఇప్పుడు ఆ సంస్థకు, విజయ్ దేవరకొండకు ఎలాంటి ఒప్పందాలు లేవని క్లారిటీ ఇచ్చింది. అందువల్ల విజయ్ దేవరకొండ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చింది. విజయ్ ఏ ఇల్లీగల్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదని తెలిపింది.