/rtv/media/media_files/2025/01/17/qAlQsz7TYUPCOJUxQSoK.jpg)
Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘సంక్రాతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి క్యూ కడుతున్నారు. దీంతో కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. తొలి రోజే రూ.45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వెంకటేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘సంక్రాతికి వస్తున్నాం’ నిలిచింది.
Any centre, single hand ~ Victory @venkymama 🔥🔥🔥
— Sri Venkateswara Creations (@SVC_official) January 17, 2025
106Cr+ Gross worldwide in 3 Days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥❤️🔥❤️🔥
The OG of Sankranthi has set the box office on fire, bringing festive celebrations alive in theatres 💥
— https://t.co/ocLq3HYNtH… pic.twitter.com/AR5ZlaPvjR
Also Read : లాస్ ఏంజెలెస్ నుంచి మహేశ్ బాబు కోసం హైదరాబాద్ కు ప్రియాంక.. ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్!
మూడు రోజుల్లో 106 కోట్లు..
ఈ సినిమా విడుదలైన తొలి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లను నమోదు చేయగా, రెండో రోజు రూ. 32 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మూడో రోజుకి రూ. 29 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తం మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.
"ఏనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ విక్టరీ వెంకీ మామ" అంటూ మూడు రోజుల గ్రాండ్ కలెక్షన్ల వివరాలతో ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం సంక్రాంతి సెలవుల ప్రభావంతో ఈ చిత్రానికి రాబోయే రోజుల్లో కూడా భారీ కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read : Game Changer: గేమ్ ఛేంజర్ పై కుట్ర చేసింది వీళ్లే.. ఆరుగురి అరెస్ట్!
Also Read : 'సంక్రాంతికి వస్తున్నాం' లో హీరోయిన్ రోల్ ను అంతమంది రిజెక్ట్ చేశారా?