నేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో సినీ సెలెబ్రిటీలు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. టాలీవుడ్ విషయానికొస్తే.. స్టార్ హీరోలతో పాటూ హీరోయిన్స్ కూడా న్యూ ఇయర్ ను ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఈ సెలెబ్రేషన్స్ కోసం ఏ హీరో ఎక్కిడికి వెళ్తున్నాడు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.. జూనియర్ ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం తారక్ అందరికంటే ముందే ఫారిన్ వెళ్ళిపోయాడు. ప్రెజెంట్ ఆయన ఫ్యామిలితో లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం లండన్ వీధుల్లో తారక్ ఫ్యామిలీ చక్కర్లు కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగ చైతన్య అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవలే శోభిత దూళిపాళను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. చైతూ తన భార్యతో కలిసి ఈసారి న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు. వీరిద్దరూ కలిసి ముంబైలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. Also Read: అమిత్ షా సంచలన నిర్ణయం.. తెలంగాణలోకి 2వేల కేంద్ర బలగాలు! మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ ప్రతీ ఏడాది ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఫారిన్ వెళ్తారు. ఈసారి కూడా విదేశాల్లోనే న్యూ సెలెబ్రేట్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ మహేష్ బాబు.. రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈసారి న్యూ ఇయర్ ను ఇటలీలో సెలెబ్రేట్ చేసుకోనున్నారట. ప్రస్తుతం డార్లింగ్ ఇటలీలోనే ఉన్నాడు. సర్జరీ కోసం ఇటీవలే అక్కడికి వెళ్ళాడు. Also Read: తిరుపతిలో దారుణం.. రూ.1500 కోసం మర్డర్.. అసలేమైందంటే? రామ్ చరణ్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ కోసం వరుస ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు. సో ఈసారి సెలెబ్రేషన్స్ కు చెర్రీ విదేశాలకు వెళ్లే ఛాన్స్ లేదు. ఈ న్యూ ఇయర్ కి ఇంటి దగ్గరే ఫ్యామిలీతో గడపనున్నాడు. అల్లు అర్జున్ అల్లు అర్జున్ ప్రెజెంట్ సంధ్య థియేటర్ ఇష్యుతో బయట ఎక్కడికి వెళ్లే ఛాన్స్ లేదు. కాబట్టి ఆయన కూడా ఇంట్లోనే ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోనున్నారు.