/rtv/media/media_files/2025/02/23/rsNsQUxd38hu5AbjrOQT.jpg)
dubai match Photograph: (dubai match)
IND vs PAK Champions Trophy: దుబాయ్ వేదికగా ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతోంది. ఇండియా వర్సెస్ పాక్ జట్ల మధ్య పోటీ కావడంతో ఉత్కంఠబరితంగా మ్యాచ్ సాగుతోంది. ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడడానికి పలువురు సెలబ్రెటీలు స్టేడియానికి వెళ్లారు. డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేశ్‌లో స్టేడియంలోన కూర్చొని లైవ్‌లో మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
Creative Director #Sukumar Garu & Minister #NaraLokesh Garu seen cheering for #TeamIndia in #Dubai Today 🏏🇮🇳✨@aryasukku @naralokesh@thabithasukumar @starsportsindia@starsportstel @bcci #Pushpa2#INDvsPAK #India #ChampionsTrophy pic.twitter.com/qLMaNOC0fm
— Thyview (@Thyview) February 23, 2025
సినీ నటుడు చిరంజీవి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిణి రెడ్డితోపాటు స్టేడియంలో ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఏపీ మంత్రి నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, ఫిల్మ్ డైరెక్టర్ సుకుమార్ తదితరులు కూడా టీమిండియా జెర్సీని ధరించి భారత జట్టును ఎంకరేజ్ చేస్తున్నారు. సుకుమార్ ఫ్యామిలీతోపాటుగా స్టేడియంలో కూర్చొని లైవ్ మ్యాచ్‌ను చూస్తున్నారు. నారా లోకేశ్ కూడా కుమారుడు దేవాన్ష్‌ను క్రికెట్ మ్యాచ్ చూడటానికి తీసుకొచ్చారు.
Come on India! Wishing our team all the best!#INDvsPAK#ICCChampionsTrophy pic.twitter.com/u0wTBYdSuR
— Lokesh Nara (@naralokesh) February 23, 2025
ఇక అటు సినీ తారలను, స్పోర్ట్స్ స్టార్స్‌ను, పొలిటికల్ లీడర్లను ఓకే తెరపై చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు.
Also Read: ఫ్రీగా కుంభమేళా ట్రిప్.. రూపాయి ఖర్చు పెట్టకుండా 1500KM ప్రయాణం
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతోన్న మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నారు. టీమిండియా జట్టు పాక్ పై గెలిస్తే సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టనుంది. దీంతో క్రికెట్ అభిమానులు ప్లేయర్లపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇండియా అంతా రెప్ప ఆర్పకుండా ఈ మ్యాచ్ వీక్షిస్తోంది.
Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!