Posani Arrest: పోసాని అరెస్ట్.. పాత బూతు వీడియోలను వైరల్ చేస్తున్న టీడీపీ!

నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోసాని గతంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ పై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

New Update
TDP fans making old videos viral with Posani krishna murali arrest

TDP fans making old videos viral with Posani krishna murali arrest

Posani Arrest: టాలీవుడ్ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పలు ఇంటర్వ్యూలలో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. పోసానిపై పోలీసు స్టేషన్‌లలో పలు కేసులు నమోదయ్యాయి.

ఇది కూడా చూడండిఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. రాయచోటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ తరుణంలో పోసానికి సంబంధించిన పలు బూతు వీడియోలను టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. గతంలో అతడు చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి వాడిన అసభ్య పదజాలం వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

పోసాని పాత వీడియోలు

ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు