Tollywood Divorce: ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకునే సెలెబ్రెటీల సంఖ్య ఎక్కువైంది. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక భేదాభిప్రాయాలతో విడాకుల బాట పడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సెలెబ్రెటీ చేరబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్
స్వాతి విడాకులు (Colors Swathi On Divorce)
టాలీవుడ్ హీరోయిన్ కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. స్వాతి 2018లో వికాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అప్పుడప్పుడు ఒకటి రెండు సినిమాలు చేస్తూ.. తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీ లైఫ్ పై కేటాయించారు. అయితే తాజాగా స్వాతి తన సోషల్ అకౌంట్ లో భర్తకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో స్వాతి ఇండైరెక్ట్ గా విడాకులు కన్ఫార్మ్ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే గతంలో కూడా వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు రాగా.. పలు ఇంటర్వ్యూలో దీని గురించి స్వాతిని ప్రశ్నించారు. దీంతో ఆమె ఫోటోలు డిలేట్ చేసినంత మాత్రాన విడిపోతున్నట్లు ఎలా అనుకుంటారు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా
కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా కలర్స్ స్వాతిగా మారింది స్వాతిరెడ్డి. స్వాతికి తెలుగులో అష్టా చమ్మా సినిమాతో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కార్తికేయ సినిమా ఆమె కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది. స్వాతి తెలుగులో జిలాని,బ్రేకప్,లేడీస్ అండ్ జెంటిల్మెన్,చిత్రాంగద, సింబా మొదలైన సినిమాలు చేసింది. చివరిగా 'మంత్ ఆఫ్ మధు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read : భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!
Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా