SSMB 29 Update: ‘SSMB 29’ నుంచి మహేశ్, ప్రియాంక కిర్రాక్ ఫొటోలు.. వాలీబాల్ ఆడుతున్న జక్కన్న!

మహేశ్ బాబు-రాజమౌళి ‘ssmb29’ మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తయింది. దీంతో హీరో హీరోయిన్లను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించగా.. వారితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. గత 15 రోజుల నుంచి ఈ సినిమా చిత్రీకరణ కోరాపుట్ జిల్లాలో జరిగింది.

New Update
SSMB 29 movie Odisha schedule is complete. Mahesh and Priyanka's photos are going viral

SSMB 29 movie Odisha schedule is complete. Mahesh and Priyanka photos viral

మహేశ్ బాబు - రాజమౌళి ‘SSMB29’ సినిమా షూటింగ్ పరుగులు పెడుతుంది. ఇటీవల ఈ చిత్రాన్ని పట్టాలెక్కించిన జక్కన్న ఓవర్‌స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ మూవీలో మహేశ్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరుగుతోంది. 

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

15 రోజుల నుంచి షూటింగ్

గత 15 రోజుల నుంచి ఈ షూటింగ్ జరుగుతుండగా.. ఇందులో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్‌సీల్‌, బాల్డ ప్రాంతాల్లో వీరితో పాటు ప్రముఖ నటీనటులపై ఆసక్తికర సన్నివేశాలను జక్కన షూట్ చేశాడు.  మొత్తంగా ఇన్ని రోజుల తర్వాత ఈ ఒడిశా షెడ్యూల్ షూటింగ్ మంగళవారంతో పూర్తయింది. 

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

దీంతో హీరో మహేశ్ బాబు, హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, దర్శకుడు రాజమౌళిని చూసేందుకు అభిమానులు షూటింగ్ స్పాట్‌కు తరలి వచ్చారు. అక్కడ వారితో ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..

Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

చిత్రబృందం తమ ప్రాంతాన్ని వచ్చినట్లు తెలుసుకున్న పొట్టంగి ఎమ్మెల్యే రామ్‌చంద్ర కడం నేతృత్వంలోని పలువురు ప్రజాప్రతినిధులు మూవీ యూనిట్‌ను కలిశారు. వారు కూడా సినిమా స్టార్లతో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ.. ఇక్కడి ప్రకృతి అందాలు తమని ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపింది. అంతేకాకుండా జిల్లా యంత్రాంగం, ప్రజల సహకారం ఎప్పటికీ మరువలేమని మూవీ యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. అన్ని పనులు పూర్తయిన తర్వాత చిత్రబృందం మంగళవారం రాత్రే అక్కడినుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. కానీ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, రాజమౌళి బుధవారం ఉదయం ఆ ప్రాంతాన్ని వీడారు. 

Advertisment
Advertisment
Advertisment