/rtv/media/media_files/2025/01/14/SOdmMEBKR6UUtzgGLtLh.jpg)
Ram Gopal Varma shocking post on Game Changer movie
RGV: కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సంచలన పోస్ట్ పెట్టాడు. అబద్ధం చెప్పినా జనాలు నమ్మాలని, ఎందుకు తప్పుడు లెక్కలు చెబుతారంటూ సెటైర్స్ వేశాడు. ఈ మేరకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’ ఇటీవల విడుదలై పాజిటీవ్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారని, కలెక్షన్స్ కూడా భారీస్థాయిలో రాబడుతోందంటూ నెట్టింట ఫ్యాన్స్ రచ్చ చేశారు. దీంతో వాటిని ఖండిస్తూ రామ్ గోపాల్ వర్మ విమర్శలు గుప్పించాడు.
Someone who has lost their charm and hasn’t managed to recover even 10% of a movie’s cost for over a decade has no relevance in commenting on collections - Film trade pundits
— Lord Shiv🥛 (@lordshivom) January 13, 2025
Have some shame @RGVzoomin
అబద్ధం జనాలు నమ్మేలా ఉండాలి..
ఈ మేరకు 'గేమ్ ఛేంజర్' బడ్జెట్, కలెక్షన్లను ఉద్దేశిస్తూ.. ‘ఈ సినిమా బడ్జెట్ రూ.450 కోట్లు అయితే.. రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ 'ఆర్ఆర్ఆర్'కు రూ. 4500 కోట్లు బడ్జెట్ పెట్టుండాలి. 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.186 కోట్లు వచ్చాయంటే.. అల్లు అర్జున్ 'పుష్ప2' సినిమాకు రూ.1860 కోట్లు వసూళ్లు అయివుండాలి.
ఇది కూడా చదవండి: Khammam: అన్నా నన్ను చంపేస్తున్నారు.. ఖమ్మంలో యువకుడి కిడ్నాప్ కలకలం!
ఏదైనా నిజాన్ని నమ్మడానికి బెసిక్ ప్రిన్సిపుల్ ఉండాలి. అది అబద్దమైన నిజమని జనాలు నమ్మేలా ఉండాలి’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా మెగా ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో ఆర్జీవిపై విరుచుకు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇది కూడా చదవండి: ఇది గేమ్ ఛేంజర్ సంక్రాంతి.. తెలంగాణలో పాలిటిక్స్ లో రానున్న ఊహించని మార్పులివే!