/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/varma-jpg.webp)
ram gopal varma
Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 27 ఏళ్లు క్రితం విడుదలైన సత్య చిత్రం ఎంత హిట్ సాధించిందో తెలిసిందే. జేడీ చక్రవర్తి(JD Chakravarthy), మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఒక దర్శకుడిగా తన గౌరవాన్ని పెంచే సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
A SATYA CONFESSION TO MYSELF
— Ram Gopal Varma (@RGVzoomin) January 20, 2025
—— Ram Gopal Varma
By the time SATYA was rolling to an end , while watching it 2 days back for 1st time after 27 yrs, I started choking with tears rolling down my cheeks and I dint care if anyone would see
The tears were not…
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు
గొప్ప సినిమా తీశానని..
27 ఏళ్ల తర్వాత సత్య సినిమా చూశా.. తెలియకుండానే నాకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు వచ్చాయన్నారు. సినిమా డైరెక్ట్ చేయడమంటే బిడ్డకు జన్మనివ్వడంతో సమానమన్నారు. సినిమా విడుదల అయిన తర్వాత ఒక్కోరు ఒక్కోలా మాట్లాడతారు. అయితే నేను తీసిన సినిమాలు హిట్ అయినా.. కాకపోయినా.. మళ్లీ పనిలో ముందుకు వెళ్తున్న అన్నారు. సత్య సినిమా చూసినప్పుడు తనకు ఎన్నో విషయాలు గుర్తు వచ్చాయని, ఈ సినిమాను ఎందుకు తాను బెంచ్‌మార్క్‌గా ఎందుకు పెట్టుకోలేదని అనుకున్నారట. గొప్ప సినిమాను డైరెక్ట్ చేశాననే ఆనందం వల్ల కన్నీళ్లు వచ్చాయన్నారు. సత్య వంటి గొప్ప సినిమాలు తీయలేకపోయాను.. నాపై ఎందరో పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నానని తెలిపారు.
ఇది కూడా చూడండి: Health: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!
మద్యంతో కాకుండా సినిమాలు హిట్ కావడంతో అహంకారంతో తాగుబోతు అయ్యానన్నారు. సత్య మూవీ(Sathya Movie) చూసే వరకు నాకు ఆ గొప్పతనం అర్థం కాలేదన్నారు. రంగీలా(Rangeela), సత్య వంటి సినిమాల వల్ల కళ్లు మూసుకుపోయాయని అందుకే ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీశానన్నారు. అర్థం లేని సినిమాలు ఎన్నో తీశానని ఆర్జీవీ(RGV) అన్నారు. సాధారణ కథతో కూడా ఎన్నో మంచి సినిమాలు తీయవచ్చని.. కానీ నేను తీయలేకపోయానన్నారు. ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని.. కానీ వాటిని చూడలేకపోయానన్నారు. ఇప్పటి వరకు చేసినవి సరిదిద్దలేను. కానీ ఇకపై చేసే ప్రతి సినిమా కూడా దర్శకుడిగా నా గౌరవం పెంచేవే చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. సత్య వంటి సినిమా కాకపోయిన కనీసం అలాంటి సినిమాలు తీస్తానన్నారు.
ఇది కూడా చూడండి: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు
ఇది కూడా చూడండి: Honey trap: టీ కోసం ఇంటికి పిలిచి.. బట్టలిప్పి టెంప్ట్ చేసి: హనీట్రాప్ ముఠా గుట్టురట్టు!