RGV: డైరెక్టర్ ఆర్జీవీకి బిగ్ షాక్..  మూడు నెలల జైలు శిక్ష

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో  మంగళవారం కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

New Update
varma

varma Photograph: (varma)

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు (Ram Gopal Varma)  బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో వర్మకు 3 నెలల సాధారణ జైలు శిక్ష పడింది. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్షతో పాటుగా జరిమానాను కూడా విధించింది. వాస్తవానికి ఈ కేసు ఇప్పటిది కాదు గత ఏడేళ్లుగా కోర్టులో విచారణ జరుగుతోంది.  తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది.  అయితే ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వర్మ కోర్టుకు గైర్హాజరయ్యారు.

Also Read :  ఫొటోకొక్క ఫోజు.. బ్లూ షర్ట్ లో శ్రీలీల చూపులకు కుర్రాళ్ళు పడిపోవాల్సిందే!

దీనిని దృష్టిలో ఉంచుకుని  కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.  భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మను దోషిగా నిర్ధారించారు. మూడు నెలల్లోగా ఫిర్యాదుదారుడికి వర్మ రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది.  ఈ నేరం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 131 కిందకు వస్తుందని, దీని కింద చిత్రనిర్మాతపై చట్టపరమైన చర్య తీసుకోబడిందని కోర్టు అభిప్రాయపడింది.  కాగా ఇదే కేసులో వర్మకు ఇప్పటికే ఓ సారి బెయిల్ కూడా లభించింది. ఈ చెక్ బౌన్స్ కేసును 2018లో మహేశ్‌చంద్ర మిశ్రా తరపున శ్రీ అనే సంస్థ దాఖలు చేసింది. ఈ కేసు వర్మ సంస్థపై ఉంది. 

Also Read :  మిమల్ని చంపేస్తాం.. బాలీవుడ్ నటులకు పాక్ షాక్!

సిండికేట్ తో వర్మ 

శివ, సత్య , రంగీలా , కంపెనీ, సర్కార్ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన వర్మ ఆ తరువాత తనదైన  మార్క్ ను కొనసాగించలేకపోయారు.  ఈ క్రమంలో వర్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా తాను తీస్తున్న సినిమాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన వర్మ... ఇకనుంచి తన స్థాయి తగ్గ సినిమాలు చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే సిండికేట్ అనే ఓ సినిమాను చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించారు.  ‘ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్’ అంటూ ఈ సినిమాకు ట్యాగ్ లైన్ కూడా పెట్టారు వర్మ. పెద్ద స్టార్ లతోనే ఈ సినిమా తీయాలని వర్మ డిసైడ్ అయ్యారట. మరి ఈ సినిమా ఎలాఉండబోతుందో అన్నది చూడాలి.  

Also Read :  ఇదే నా లాస్ట్ సినిమా.. రిటైర్మెంట్ పై రష్మిక సంచలన ప్రకటన

Also Read :  ఒక ఆలింగనం..ఎన్నో ఆత్మీయతలు..ఆటోడ్రైవర్‌ను కౌగిలించుకున్న సైఫ్‌ఆలీఖాన్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Urvashi Rautela: దబిడి దిబిడి భామకు గోల్డెన్ క్వీన్‌ అవార్డు..

"డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దక్కింది. అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపారు ఊర్వశి.

New Update
Urvashi Rautela Award

Urvashi Rautela Award

Urvashi Rautela: బాలయ్య బాబుతో కలిసి డాకు మహారాజ్ లో దబిడి దిబిడి అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కష్టానికి గుర్తింపు లభించింది. ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు (గోల్డెన్ క్వీన్ అవార్డు) తన ఖాతాలో వేసుకుంది ఈ హాట్ బ్యూటీ. అయితే డాకు మహారాజ్ లో బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో నటించి మెప్పించిన ఊర్వశి "దబిడి దిబిడి" పాటతో తెలుగు ఆడియన్స్ లో  ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈ పాటపై కొంతమంది విమర్శలు చేసినా, ఊర్వశి పెర్ఫార్మన్స్ మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

Also Read: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

గోల్డెన్ క్వీన్ అవార్డు..

అయితే, ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును  అందుకున్న ఊర్వశి ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. "డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ ఈ అవార్డును అందుకున్నట్టు ఈ విషయాన్నీ ఫ్యాన్స్ తో  సోషల్ మీడియా ద్వారా  పంచుకోవడం ఆనందంగా ఉంది" అని ఊర్వశి తెలిపింది, అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన  అభిమానులందరికి  ధన్యవాదాలు తెలిపారు. 

Also Read: ‘అదిదా సర్‌ప్రైజ్‌’ ఫుల్ వీడియో సాంగ్.. సైలెంట్​గా స్టెప్ లేపేసారుగా..!

Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్

Advertisment
Advertisment
Advertisment