/rtv/media/media_files/2025/03/27/rJAMKzvv1xgHiEKC0ypx.jpg)
peddi ram charan look
RC16: మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ #RC16 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈరోజు చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు చరణ్ లుక్ రివీల్ చేశారు. #RC16 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ఫైనల్ చేశారు. టైటిల్ కి తగ్గట్లే ఇందులో చరణ్ లుక్ కూడా చాలా మాస్ అండ్ రస్టిక్ ఉంది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో చరణ్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. 'ఉప్పెన' తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఈ కథను సిద్ధం చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
స్పోర్ట్స్ డ్రామా
ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇటీవలే మైసూర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్.. అక్కడి నుంచి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి యూనిట్ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
𝐀 𝐌𝐀𝐍 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐋𝐀𝐍𝐃, 𝐀 𝐅𝐎𝐑𝐂𝐄 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐍𝐀𝐓𝐔𝐑𝐄 ❤️🔥#RC16 is #PEDDI 🔥💥
— Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2025
Happy Birthday, Global Star @AlwaysRamCharan ✨#HBDRamCharan#RamCharanRevolts@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/ae8BkshtR3
ఇది కూడా చూడండి: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. జగపతిబాబు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
ram charan peddi | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | latest tollywood updates | 2025 Tollywood movies
Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!