Producer SKN: తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎంకరేజ్ చేస్తాం: ‘బేబీ’ నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు!

తెలుగు అమ్మాయిలపై ‘బేబి’ నిర్మాత ఎస్‌కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తుంటాం అని అన్నారు. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో బాగా తెలిసిందని చెప్పుకొచ్చారు. ఓ సినిమా ఈవెంట్‌లో మాట్లాడారు.

New Update
producer skn controversial comments on telugu heroins at Return of the Dragon pre release event

producer skn controversial comments on telugu heroins at Return of the Dragon pre release event

‘బేబి’ (Baby) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాత ఎస్‌కేఎన్ (శ్రీనివాస్ కుమార్) తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కల్ట్ ప్రొడ్యూసర్‌గా పేరు సంపాదించుకున్న అతడు తాజాగా తెలుగు హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ హీరో నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా ప్రీ రిలీజ్‌లో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి. 

Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!

తెలుగు రాని అమ్మాయిలే కావాలి

ఈ మేరకు తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో తనకు తెలిసి వచ్చిందని అన్నారు. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘‘తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల (Telugu Ammailu) కంటే.. తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎక్కువగా లవ్ చేస్తుంటాం అని అన్నారు.

ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో నాకు బాగా తెలిసింది. అందువల్ల నేను.. మా దర్శకుడు సాయి రాజేశ్ తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు. దీంతో అతడి వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చూడాలి మరి ఇది ఎంత వరకు దారి తీస్తుందో.

Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా 

ఇప్పుడిప్పుడే కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఓ వైపు డైరెక్టర్‌గా రాణిస్తూనే.. మరోవైపు హీరోగా పలు సినిమాలు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. గతంలో లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో హీరోగా చేయడమే కాకుండా.. దర్శకత్వం వహించింది కూడా అతడే కావడం గమనార్హం. 

ఇప్పుడీ హీరో మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. ‘డ్రాగన్’ అనే తీస్తున్నాడు. ఈ సినిమాకి అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచానాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఫుల్ బజ్ క్రియేట్ చేశాయి. మరి ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Shruti Haasan: నన్ను ఎవరూ ఆనందపరచలేదు.. బ్రేకప్ లిస్ట్ పై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

స్టార్ నటి శృతిహాసన్‌ తన ప్రేమకథ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బ్రేకప్స్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యానని చెప్పింది. ‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్‌?’ అని అడుగుతుంటే బాధగా ఉంటుంది. కానీ నా దృష్టిలో బ్రేకప్ కేవలం నంబర్‌ మాత్రమే' అని చెప్పింది. 

New Update
dsruthi

Shruti Haasan interesting comments about love storys

Shruti Haasan: స్టార్ నటి శృతిహాసన్‌ తన ప్రేమ, పెళ్లి గురించి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన పేరెంట్స్ డివోర్స్ కారణంగా తాము ఎదుర్కొన్న అవమానాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా లవ్ స్టోరీస్, బ్రేకప్స్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యానని, తన జీవితంలోకి వచ్చిన వారెవరు ఆనందాన్ని ఇవ్వలేకపోయారని తెలిపింది. 

Also Read :  గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి!

ఎన్నో బాయ్‌ఫ్రెండ్‌?

ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. ‘నా లైఫ్ లో అత్యంత బాధపడిన సందర్భం లేదు. నాకెంతో ఇష్టమైన వారిని కూడా బాధపెట్టాను. వారికి జీవితాంతం సారీ చెబుతూనే ఉంటా' అని చెప్పింది. ఇక ప్రతి ఒక్కరికి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుందని, తనకు కూడా చాలా బ్రేకప్‌ స్టోరీలున్నాయని చెప్పింది. అయితే బ్రేకప్‌ తర్వాత దాని గురించి ఆలోచించనని, ‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్‌?’ అంటూ అడుగుతుంటారని తెలిపింది. కానీ తన దృష్టిలో బ్రేకప్ కేవలం నంబర్‌ మాత్రమేనని చెప్పేసింది. కొన్నిసార్లు ఇతరుల మాటలు బాధపెడుతుంటాయని, తాను కూడా మనిషినేనని చెప్పింది.

Also Read :  భారత్,పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్.. అధికారులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎమర్జెన్సీ మీటింగ్!

ఇక ‘గబ్బర్‌సింగ్‌’ సినిమా తన కెరీర్ కు బూస్ట్ ఇచ్చిందని, అంతకుముందు తనను ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ చేశారని వాపోయింది. ఫెయిల్ అయిన సినిమాల్లో హీరోను కాకుండా కేవలం తనను మాత్రమే టార్గెట్ చేయడం బాధకరమని చెప్పింది. ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాతే నా కెరీర్ ఊపందుకుంది. అయినా నేను నాకు నచ్చిన సినిమాల్లోనే నటించాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. 

Also Read :  చెలరేగిపోయిన రికిల్టన్, సూర్య.. లక్నో ముందు భారీ టార్గెట్

Also Read :  గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి!

sruthihasan | love | breakup | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment