Priyanka Chopra: 'SSMB 29' కోసం ప్రియాంక భారీ రెమ్యునరేషన్ .. ఏకంగా అన్ని కోట్లా!

 'SSMB 29' కోసం ప్రియాంక భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు నెట్టింట వార్తలు వైరలవుతున్నాయి. హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం సుమారు రూ.40 కోట్లు వరకు ఉండొచ్చని టాక్.

New Update
Priyanka chopra ssmb

Priyanka chopra ssmb

Priyanka Chopra:  రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్  'SSMB 29'. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పై వెళ్లనుంది.  అయితే ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే ప్రియాంకకు సంబంధించిన ప్రీ లుక్ టెస్ట్ కూడా పూర్తిచేసినట్టు సమాచారం. 

Also Read: వాంతికి రావడంతో బస్సులో నుంచి తల బయటకు.. కట్ చేస్తే రోడ్డుపై తల, చేయి!

భారీ రెమ్యునరేషన్.. 

ఈ క్రమంలో 'SSMB 29' కోసం ప్రియాంక తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి నెట్టింట ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్లు తీసుకున్న రెమ్యునరేషన్ లో ఇదే అత్యధికమని చెబుతున్నారు. కల్కి 2898 AD కోసం దీపికా తీసుకున్న రూ.20 కోట్ల రికార్డును మించి ప్రియాంక ఈ ప్రాజెక్ట్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: Daaku Maharaaj: దబిడి దిబిడే.. ఓటీటీలోకి బాలయ్య డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రూ.40 కోట్లు వరకు

 'SSMB 29' కోసం ప్రియాంక సుమారు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.  అయితే హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం సుమారు రూ.40 కోట్లు వరకు ఉండొచ్చని  వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు ముందు చేసిన హాలీవుడ్ సీరీస్ సిటాడెల్ కోసం ప్రియాంక ఐదు మిలియన్ డాలర్ల పారితోషికం అందుకున్నారట. 

 Also Read: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

రెండు భాగాలుగా 

సుమారు 900 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే  హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభోత్సవం తర్వాత..  RFCలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరణను  స్టార్ట్ చేసినట్లు సమాచారం. అద్భుతమైన సైంటిఫిక్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ స్టోరీ కోసం రాజమౌళి దేశ, విదేశాలలో ప్రాచుర్యం పొందిన నటులు, నటీనటులను ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 Also Read:  Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు