/rtv/media/media_files/2025/02/19/I20CVrSLYLIuXt6mNBB3.jpg)
SPIRIT MOVIE UPDATES
Prabhas Spirit Updates: కల్కి(KALKI 2898 AD)తో సూపర్ సక్సెస్ కొట్టిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రస్తుతం అనేక భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం, మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్(THE RAJA SAAB) చిత్రంపై పని చేస్తూనే, సీతారామంతో స్టార్ డైరెక్టర్ గా మారిన హాను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ(FAUJI) అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులనే డార్లింగ్ ఎప్పటికి ఫినిష్ చేస్తాడో తెలియని పరిస్థితి అయితే ప్రభాస్ లైన్ అప్ లో ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి.
Also Read: మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!
ప్రభాస్ లైన్ అప్ లో స్పిరిట్ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. 'యానిమల్' బ్లాక్‌బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా క్రేజ్ ఆకాశానికి పెరిగింది. దీంతో, స్పిరిట్ పై భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. ప్రభాస్ అభిమానులు స్పిరిట్ కోసం భయంకరంగా ఎదురు చూస్తున్నారు.
Also Read: ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!
అయితే ప్రస్తుతం, స్పిరిట్ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ వెల్లడించాడు. ఆయన తెలిపిన మేరకు, స్పిరిట్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికే ప్రారంభమైయ్యాయి. అంతేకాకుండా, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఉగాది రోజున ప్రారంభమవుతాయని హర్షవర్ధన్ తెలియజేసాడు. ఈ మాటలు విన్న ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్
డ్యూయల్ రోల్‌లో ప్రభాస్..
స్పిరిట్ సినిమాను సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించనున్నారని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని దర్శకుడు సందీప్ ముందే ప్రకటించాడు. అంతే కాదు ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో కూడా కనిపించబోతున్నాడని టాక్. ప్రభాస్ పాత్ర హై ఓల్టేజ్ యాక్షన్‌తో, చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రత్యేకంగా, ప్రభాస్ తన కెరీర్లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండడం విశేషం.
Also Read: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!
ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ స్పిరిట్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఈ మూవీ ఫ్యాన్స్‌కి కొత్త అనుభవం అందిస్తుందని నమ్మకం. స్పిరిట్ తో ప్రభాస్ ఇంకెన్ని వండర్స్ సృష్టిస్తాడో చూడాలి మరి.