/rtv/media/media_files/2025/02/15/awY5r2w7oILHGPiE1GNm.jpg)
Prabhas Spirit Movie Casting Call Offer
Prabhas Spirit Casting Call: ప్రభాస్.. టాలీవుడ్(Tollywood)లోనే కాదు, భారతీయ సినిమా(Indian Cinema) పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న పాన్ ఇండియా సూపర్‌స్టార్. ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలు అన్ని వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం ఒక సాధారణ విషయం అయిపోయింది. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో చిన్న పాత్రలో అయినా కనిపించడం కోసం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ వర్గాల నుండి చాలా మంది స్టార్స్ ఎదురుచూస్తుంటారు అది మన డార్లింగ్ ప్రభాస్ రేంజ్.
Also Read : వల్లభనేని వంశీ అరెస్ట్..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!
స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం..
అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రూపొందించబోయే స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం కలిపిస్తూ కాస్టింగ్ కాల్‌కి(Spirit Movie Casting Call) ప్రకటన చేసారు మేకర్స్, కథ ఆధారంగా కొత్త నటీ నటులు కావాలని చెప్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న వారు తమ ఫోటోలు, వీడియోలను [[email protected]](mailto:[email protected]) మెయిల్ ఐడీకి పంపించాలని పిలుపునిచ్చారు.
Also Read : RCB vs GG : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ శుభారంభం
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు, భారీ బడ్జెట్‌తో సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను తీస్తున్నారు. యానిమల్ తరువాత, స్పిరిట్ తో మరో భారీ బ్లాక్ బస్టర్‌ను కొట్టాలన్నది సందీప్ రెడ్డి వంగ టార్గెట్. ప్రభాస్ కల్కి సూపర్ హిట్ తర్వాత స్పిరిట్ ను పాన్ ఇండియా స్థాయిలో కాకుండా, ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్.
Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్!
సందీప్ వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషలతో పాటు, విదేశీ భాషల్లో కూడా విడుదల కానుంది. వర్కౌట్ అయితే మాత్రం రూ. 2000 కోట్లు వసూలు అందుకోవటం పక్కా. సలార్, కల్కి వంటి భారీ విజయాలను అందుకున్న ప్రభాస్, నెక్స్ట్ రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో మరిన్ని విజయాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: Maha Kumbh Mela: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన
వచ్చే ఏడాదిలో స్పిరిట్ విడుదల అవుతుండగా, ఈ క్రేజీ సినిమాలో నటించే అవకాశాన్ని మీరు కూడా దక్కించుకోవచ్చు. ఆసక్తి ఉంటే, వెంటనే మీ ఫోటోలు, వీడియోలను పైన ఉన్న మెయిల్ కి పంపించండి.
We’re calling all aspiring actors for an exciting casting opportunity in our film, "Spirit". pic.twitter.com/DgLZ5kIvNO
— Bhadrakali Pictures (@VangaPictures) February 12, 2025