Prabhas in Kannappa: మంచు విష్ణు తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. ఇందులో ప్రభాస్ నటిస్తున్నాడని ఎప్పటినుంచో అందరూ వింటున్న వార్తే. మొదటి శివుడుగ అనుకున్నారు. కానీ అక్షయ్ కుమార్ ఎంట్రీతో అది కాదని తెలిసిపోయింది. అయితే అప్పటికీ ప్రభాస్ నటిస్తున్నాడని చెబుతూ మూవీ టీమ్ అతని కాళ్ళతో డిజైన్ చేసిన పోస్టర్ ను విడుదల చేసింది. దీంతో అందరికీ ప్రభాస్ ఏ క్యారెక్టర్లో నటిస్తున్నాడో అంటూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. అతని కోసం ఒక స్పషల్ క్యారెక్టర్ డిజైన్ చేశారని ఊహించారు. సినిమాలో కాసేపే ఉంటాడని అనుకున్నారు. అయితే తాజాగా కన్నప్ప మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో టీమ్ చెప్పేింది.
Also Read : నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
నందిగా ప్రభాస్...
కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నంది పాత్రలో కనిపించనున్నారు. శివుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చేస్తుండగా.. నందిగా ప్రభాస్ కనిపించనున్నాడు. అయితే ఇతని ఫస్ట్ లుక్ ను ఇంకా రివీల్ చేయలేదు. కానీ సినిమాలో అతని రూల్ కేవలం గెస్ట్ అప్పీరియెన్స్ గా మాత్రమే ఉండదని...ఒక పాట కూడా పెట్టారని తెలుస్తోంది. ఈ సాంగ్‌ని డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ కంపోజ్ చేసినట్టుగా చెబుతున్నారు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ స్క్రీన్ స్పేస్ కాస్త ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రభాస్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారని కూడా చెబుతున్నారు.
Also Read : భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!
మంచు విష్ణు తీస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే మెయిన్ క్యారెక్టర్లు అందరి లుక్ ను రివీల్ చేశారు. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి ముకుందన్ ఫీమెల్ లీడ్‌లో నటిస్తోంది. ఇక ఇందులో మోహన్ బాబుతో పాటు మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన విష్ణు త్వరలోనే ప్రభాస్‌కు సంబంధించిన స్పెషల్ టీజర్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
Also Read: దాడిపై సైఫ్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు
Also Read: వావ్! అమ్మాయితో కలిసి అల్లు అరవింద్ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా