Prabhas in kannappa: సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ పై ఫుల్ ట్రోల్స్

కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ పై  సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ప్రభాస్ లుక్ జగద్గురు ఆదిశంకర సినిమాలో నాగార్జున లుక్ పోలీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.  విగ్ సెట్ కాలేదని, వెంటనే లుక్ మార్చాలని మంచు విష్ణుకు సూచిస్తున్నారు.  

New Update
prabhas in kannappa

prabhas in kannappa

Prabhas in Kannappa: మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు. మూవీ ప్రమోషన్స్(Kannappa movie Pramotions) లో భాగంగా తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) లుక్ ను మేకర్స్  విడుదల చేశారు. కన్నప్పలో ప్రభాస్ రుద్ర(Rudra)గా  కనిపించనున్నట్లుగా వెల్లడించారు.  ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోస్టర్ షేర్ చేశారు.  

అయితే ప్రభాస్ లుక్ పై  సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది.  ఈ సినిమాలో ప్రభాస్ లుక్ జగద్గురు ఆదిశంకర సినిమాలో నాగార్జున(Nagarjuna) లుక్ పోలీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.  విగ్ సెట్ కాలేదని కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే ప్రభాస్ లుక్ మార్చాలని మంచు విష్ణుకు సోషల్ మీడియాలో సూచిస్తున్నారు.  

 

Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!

కన్నప్ప (Kannappa) ఏప్రిల్ 25న విడుదల 

ఇటీవలే కన్నప్ప నుంచి అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) పోస్టర్లు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్షయ్, కాజల్ శివపార్వతుల పాత్రలో కనిపించనున్నారు. ప్రీతి ముకుందన్‌ ఫీమెల్ లీడ్‌లో నటిస్తోంది. ఈ  భారీ బడ్జెట్ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్(AVA Entertainment Banner) పై మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. కన్నప్ప ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Also Read :  ఈ పెళ్లి కూతురు పాట వింటే పడి పడి నవ్వుతారు!.. వగలమారి వదిన.. దేవత లాంటి అత్తమ్మ అంటూ..!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు