/rtv/media/media_files/2025/03/20/aqkodt4lmnYX7yIYSVLc.jpg)
L2 Empuraan
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ 2 సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే దీని చుట్టూ అంతే కాంట్రవర్శీలు కూడా చుట్టుముడుతున్నాయి. ఇది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవకు దారితీసేలా ఉంది ఈ సినిమా అని టాక్ నడుస్తోంది. ఎంపురాన్, 'సంఘ్ ఎజెండా'ను బహిర్గతం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపించడంతో, తీవ్ర రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది.
ఎంపురాన్ పార్ట్ 2లో గుజరాత్ అల్లర్ల గురించి ఉంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ జాయెద్ మసూద్ అనే క్యారెక్టర్ ను వేశారు. ఈ సినిమాలో గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో మసూద్ పాత్రతో పాటూ అనేక ముస్లిం కుటుంబాలను దారుణంగా హత్య చేయడాన్ని చూపించారు. దాంతో పాటూ అధికార పార్టీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేసినట్లు కూడా చూపించారు. దాంతో పాటూ సినిమాలో ప్రధాన విలన్ పేరు బాబా బజరంగి. ఆయన ఒక హిందూ జాతీయ పార్టీకి నాయకుడు. ఇప్పుడు అదే ఈ సినిమాపై వివాదానికి ప్రధాన కారణంగా నిలిచింది. దీంతో కొందరు నెటిజన్లు ఇది హిందూ వ్యతిరేక సినిమా అంటూ ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్నారు. ఈ మొత్తం చిత్రీకరణ బీజేపీకి కోపం తెప్పించేదిగా ఉంది. దాంతో పాటూ కేరళను విభజించి దాని వ్యూహాత్మక తీరప్రాంతం, ఓడరేవులపై నియంత్రణ సాధించాలనే "సంఘ్ ఎజెండా"ను ఈ చిత్రం బట్టబయలు చేస్తుందని కేరళ కాంగ్రెస్ చెప్పింది. కేరళ అధికార కమ్యూనిస్ట్ పార్టీ కూడా దీన్ని సమర్థించింది.
మంచి సినిమా అంటున్న కాంగ్రెస్, వామపక్షాలు..
అయితే రైట్ వింగ్ మాత్రం ఎంపురాన్ 2 సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సినిమా హిందూ వ్యతిరేక, హిందూ దూషణ ప్రచార చిత్రం అని చెబుతున్నాయి. కానీ కేరళ కాంగ్రెస్ యూత్ వింగ్ చీఫ్, పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూట్టిత్ ఎంపురాన్ పాన్ ఇండియా సినిమాగా కొనియాడారు. మోహన్‌లాల్, పృథ్వీరాజ సుకుమారన్‌పై విద్వేషపూరిత ప్రచారాన్ని ఖండించారు. కాశ్మీరీ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి అబద్ధపు సినిమాలు, మతపరమైన ద్వేషం ఆధారంగా తీసిన సినిమాలను ప్రశంసించిన వ్యక్తులు, ఇప్పుడు ఎంపురాన్‌ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
today-latest-news-in-telugu | cinema | mohanlal | congress | bjp
Also Read: X AI Grok: గ్రోక్ దెబ్బకు చాట్ జీపీటీ వెనక్కు..