BIG BREAKING: టీడీపీలోకి మంచు మనోజ్!

మంచు ఫ్యామిలీలో విబేధాలు రచ్చకెక్కిన వేళ మరో సంచలన విషయం బయటకొచ్చింది. తండ్రి, సోదరుడిని ఎదుర్కొనేందుకు రాజకీయ అండకోసం చూస్తున్న మనోజ్‌ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. నారాలోకేశ్‌తో 45 నిమిషాలకు పైగా చర్చలు జరపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. 

New Update
manchu manoj

Manchu Manoj will join TDP

Manchu manoj: మంచు ఫ్యామిలీలో విబేధాలు రచ్చకెక్కిన వేళ మరో సంచలన విషయం బయటకొచ్చింది. తండ్రి, సోదరుడిని ఎదుర్కొనేందుకు రాజకీయ అండ కోసం చూస్తున్న మనోజ్‌ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. నారాలోకేశ్‌తో 45 నిమిషాలకు పైగా చర్చలు జరపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. 

భూమ అఖిలప్రియ మద్ధతు.. 

ఈ మేరకు తండ్రి, సోదరుడితో నెలకొన్న ఆస్తి గొడవల్లో రాజకీయ అండకోసం మంచు మనోజ్‌ టీడీపీ వైపు చూస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు త్వరలో టీడీపీలో చేరేందుకు మనోజ్‌ సిద్ధమయ్యాడనే ప్రచారం జోరందుకుంది. బుధవారం మోహన్‌బాబు యూనివర్సిటీకి వెళ్లిన మనోజ్ అక్కడి నుంచి నేరుగా.. నారావారిపల్లెకు వెళ్లి నారాలోకేశ్‌ను కలిశారు. ఆయనతో 45 నిమిఫాలపాట్ చర్చించారు. మనోజ్‌ భార్య భూమ మౌనిక సోదరి భూమ అఖిలప్రియ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండడం కూడా దీనికి మరింత బలం చేకూర్చుతుంది. 

తిరుపతిలో ఫ్లెక్సీ వార్..

మంచు కుటుంబంలో విభేదాలు ముదిరిపోతున్నాయి. అన్నదమ్ముల ఆస్తుల వివాదంతో కుటుంబం చీలిపోతుంది. మంచు విష్ణు, మోహన్ బాబు ఒక వైపు, మంచు మనోజ్ ఒక వైపు. పలు మార్లు దాడులు, ప్రతి దాడుల వరకూ పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలోనే ఇటు మోహన్ బాబు, అటు మంచు విష్ణు కూడా రాజకీయ అండ కోసం పాకులాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు, అండ కోసం వెంపర్లాడుతున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో  ప్రదర్శించిన ప్లెక్సీల్లో మోహన్ బాబు ఫొటోతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో కూడా ఉంది. 

ఇది కూడా చదవండి: లిక్కర్ స్కామ్ పార్టీని ఓడిస్తాం.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

జగన్ కు దూరంగా తండ్రి.. 

మోహన్ బాబుకు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధాలూ లేవు. జగన్ హయాంలో  2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు చంద్రబాబుపైనా, తెలుగుదేశంపైనా ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. సరే జగన్ కోసం ఎంతగా పని చేసినా, 2019 ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి వీధుల్లో అప్పటి తన విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి ఊరేగింపులు, ధర్నాలూ నిర్వహించినా జగన్ నుంచి మోహన్ బాబుకు ఎటువంటి ప్రశంసా రాలేదు. జగన్ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఊహాగానాలు ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. మోహన్ బాబుకు ఏదో కీలక కార్పొరేషన్ పదవి, రాజ్యసభ సభ్యత్వం అంటూ జోరుగా ప్రచారం జరిగింది.  జగన్ మాత్రం మోహన్ బాబుకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు. 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున ప్రచారం చేయలేదు సరికదా.. ఎన్నికల ముందు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో అప్పట్లోనే మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. చివరికి అదీ జరగలేదు. 

జర్నలిస్టుపై దాడి కేసులో అరెస్టును తప్పించుకోవడానికి అజ్ణాతంలోకి వెళ్లిన కారణంగా వార్తల్లో నిలిచారు. అలాగే ఆయన విద్యాసంస్థల విషయంలో ఆయనను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ విద్యా సంస్థలలో ఫీజులపై విద్యార్థుల తల్లిదండ్రులు పలు ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మోహన్ బాబు విద్యాసంస్థపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు చంద్రబాబుతో గతంలో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకుని ఈ చిక్కుల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంగానే మోహన్ బాబు యూనివర్సిటీలో చంద్రబాబు ఫ్లెక్సీల ప్రదర్శన అంటున్నారు. 

ఇది కూడా చదవండి: తాత KCRతో కలిసి హిమాన్షు పొలం పనులు.. పార పట్టుకుని.. వీడియో వైరల్!

చంద్రబాబుకు దగ్గరగా కొడుకు.. 

మంచు మనోజ్ కూడా చంద్రబాబుకు దగ్గర కావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కనుమ పండుగ రోజున మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారా వారి పల్లె వెళ్లి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. నారావారిపల్లెలో నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. అయితే ఇద్దరూ చాలా సేపు గడిపినప్పటికీ వీరి మధ్య ఆస్తుల వివాదం చర్చకు రానట్టు సమాచారం. ఇది మంచు కుటుంబ వ్యక్తిగత వివాదం అయిన నేపథ్యంలో ఏ వర్గం వైపు లేకుండా నారా కుటుంబం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు, యూనివర్శిటీ వద్ద చంద్రబాబుతో మోహన్ బాబు తీసుకున్న ఫొటోలు, లోకేశ్ తో మంచు విష్ణు తీసుకున్న ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో నారా కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని అందరికీ తెలిపేందుకు లోకేశ్ ను మనోజ్ కలిసినట్టు తెలుస్తోంది. మోహన్‌బాబు విషయంలో చంద్రబాబు, లోకేష్‌ కొంత వ్యతిరేకంగా ఉండడంతో ఆ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని మనోజ్‌ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా మనోజ్‌ భార్య మౌనిక సోదరి భూమ అఖిలప్రియ టీడీపీ ఎమ్మె్ల్యేగా ఉండడంతో పాటు మనోజ్‌కు చిన్నతనం నుంచి లోకేష్‌తో అనుబంధం ఉండడంతో వీరి బేటీ రాజకీయంగా చర్చనీయంశంగా మారింది. 

.. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ntr District కారు భీభత్సం .. ఏడుగురు అడ్డాకూలీలు పైకి దూసుకెళ్లింది..

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు భీభత్సం సృష్టించింది. చెరువు బజారు కట్ట వద్ద ఏడుగురు కూలీలు అందరు నిలబడి ఉండగా.. వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

Ntr District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఏడుగురు అడ్డాకూలీలపైకి కారు దూసుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే మేస్త్రీ పని చేయడానికి వచ్చిన  అడ్డాకూలీలు ఉదయం బజారు చెరువు కట్ట సర్కిల్ వద్ద నిలబడి ఉండగా.. అతి వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం  క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రస్తుతం కారును సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యే పరామర్శ.. 

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపవలసిందిగా డాక్టర్ కు సూచించారు.  గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. 

telugu-news | latest-news | ntr-district

Advertisment
Advertisment
Advertisment