/rtv/media/media_files/2025/02/08/JOZWc2y4UaeOz8Xb1mRF.jpg)
Maha Kumbh Mela Fame Monalisa First Movie Remuneration Revealed
యూపీలోని ప్రయాగ్ రాజ్ (Prayagraj) లో అత్యంత ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా (Maha Kumbh Mela) కు భక్తులు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు చేరుకున్నట్లు తెలిసింది. ఇక ఫిబ్రవరి 26తో ఈ ఉత్సవం ముగియనుండటంతో రోజు రోజుకూ కుంభమేళాకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే ఈ కుంభమేళా ఓ యువతి జీవితాన్నే మర్చేసిందని చెప్పాలి. ఆ యువతి మరెవరో కాదు మోనాలిసా (Monalisa).
Also Read: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..
అక్కడకు రుద్రాక్షలు అమ్మేందుకు వచ్చిన ఈ తేనే కళ్ల సుందరి బాగా ఫేమస్ అయిపోయింది. తన కళ్లు నెటిజన్ల మనసు దోచుకున్నాయి. దీంతో ఆమెను రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేసేశారు. గత కొద్ది రోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌కు చెందిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమా ఆఫర్ కూడా కొట్టేసిన విషయం తెలిసిందే.
‘ది డైరీ ఆఫ్ మణిపూర్’
బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ డైరెక్టర్ సనోజ్ మిశ్రాను మోనాలిసా బాగా ఆకర్షించింది. దీంతో ఆమెకు ఒక సినిమా ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం అతడు చేస్తున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాలో ఆమెకు అవకాశం కల్పించాడు. ఆమెకు యాక్టింగ్ రాకపోయినా.. నేర్పించి మరీ ఈ చిత్రంలో ఆమెను నటింపజేస్తానని అతడు ప్రకటించాడు.
Also Read: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!
రెమ్యునరేషన్
ఇక ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుండగా.. తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో నటించడానికి మోనాలిసా ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే విషయం బయటకొచ్చింది. ఈ చిత్రానికి గానూ మోనాలిసాకు దాదాపు రూ.21 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అంతేకాకుండా స్థానికంగా కూడా బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఆమె రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.