/rtv/media/media_files/2025/01/07/zL6ARuNdx7A89rZix0Fv.jpg)
ajith kumar car accident
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కు పెద్ద ప్రమాదం తప్పింది. స్పెయిన్ లో జరుగుతున్న ఆయన కారు మళ్ళీ ప్రమాదానికి గురైంది. పక్కనే వస్తున్న మరో కారును తప్పించడంలో అజిత్ వాహనం ట్రాక్ పై పల్టీలు కొట్టింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా దాని నుంచి బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ ఇన్‌స్టా లో షేర్ చేసింది. ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపింది. ఇందులో అజిత్ తప్పు ఏమీ లేదని..ఇతర కార్ల వల్లనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఆయన సురక్షితంగానే ఉండడంతో మళ్ళీ రేస్ కొనసాగిస్తున్నారు.
Also Read: HYD: సారీ అమ్మా, చనిపోతున్నా..ఉప్పల్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఇప్పటికి రెండుసార్లు..
లాస్ట్ టూ మంత్స్ లో అజిత్ కారుకు ప్రమాదం జరగడం ఇది రెండోసారి. అంతకు ముందు దుబాయ్ లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ కోసం అజిత్ ప్రాక్టీస్ చేస్తుండగా...ఆయన కారు గోడను బలంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ, అజిత్ ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ తరువాత జరిగిన ఈవెంట్ లో అజిత్ టీమ్ మూడవ స్థానంలో సంపాదించుకుంది.
సినిమాల విరామ సమయంలో హీరో అ.ిత్ రేసింగ్ చేస్తుంటారు. ఆయనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. బైక్ ల మీద టూర్లు వెళ్ళడం, రేస్ లలో పాల్గొనడం చేస్తుంటారు. మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అజిత్ ఓ స్టార్టప్‌ను కూడా ఏర్పాటు చేశారు. అజిత్‌కుమార్ రేసింగ్ పేరుతో ఒక టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు. అదే దుబాయ్ లో జరిగిన రేసింగ్ లో విజయం సాధించింది.
Also Read: Vizag: లోకల్ బాయ్ నానిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు