/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Shankar-reprises-Ukraine-for-Rajinikanth-1200x800-2-1024x683.webp)
ED Gives Big Shock To Director Shankar in robo movie case
Director Shanker: సినీ దర్శకుడు శంకర్ కు ED బిగ్ షాక్ ఇచ్చింది. 2011లో 'రోబో' సినిమా కథను కాపీ కొట్టారంటూ తమిళ రచయిత ఆరూర్ తమిళ్‌నందన్ వేసిన కేసులో శంకర్‌కు చెందిన రూ.10.11 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.1957 సెక్షన్ 63ను శంకర్ ఉల్లంఘించినట్లు తెలిపింది.
'జిగుబా' పుస్తకంలోని కథ..
ఈ మేరకు రచయిత ఆరూర్ తమిళనాథన్ తన 'జిగుబా' పుస్తకంలోని కథను శంకర్ కాపీ కొట్టారంటూ 2011లో ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన కథతోనే 'రోబో' సినిమా తీశాడని, కాపీరైట్ యాక్ట్ 1957ను అతిక్రమించినందుకు శంకర్ పై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో విచారణ చేపట్టిన ఎగ్మోర్ కోర్ట్.. ఆ సినిమా ద్వారా రూ.11.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు గుర్తించింది. ఈడీ శంకర్ కు చెందిన ఆస్తులను అటాచ్ చేయగా శంకర్ ఇంకా దీనిపై స్పందించలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలై 'రోబో' రూ. 290 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ వెల్లడించింది.