Chaava Movie: పార్లమెంట్‌లో చావా మూవీ.. స్పెషల్ స్క్రీన్‌లో వీక్షించనున్న మోదీ

ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రాన్ని పార్లమెంట్‌లో ప్రదర్శించనున్నారు. ఎంపీలతో పాటు ప్రధాని మోదీ స్పెషల్ స్క్రీన్‌లో మూవీ చూడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 27వ తేదీన సాయంత్రం 6 గంటలకు మూవీని ప్రదర్శించనున్నారు.

New Update
Chaava movie in Parliament

Chaava movie in Parliament Photograph: (Chaava movie in Parliament)

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఇటీవల తెరకెక్కిన చిత్రం చావా. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్యా దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, అలోక్ నాథ్, ప్రదీప్ రావత్ వంటి ప్రముఖలు కూడా నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ ఫిబ్రవరి 14వ తేదీన విడుదల అయ్యింది. ఆ రోజు నుంచే మూవీ మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇది కూడా చూడండి: Betting Apps Anvesh: యూట్యూబర్‌ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!

ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!

ఎంపీలతో కలిసి మోదీ కూడా..

మొదటి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయలేదు. ఉత్తరాదిలో మంచి రెస్పాన్స్ రావడంతో మళ్లీ తెలుగులో మార్చి 7న రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాను పార్లమెంట్‌లో ప్రదర్శించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 27వ తేదీన గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాను ప్రత్యేక స్క్రీన్‌లో వేయనున్నారు. ఈ మూవీని దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలు చూడటంతో పాటు ప్రధాని మోదీ కూడా వీక్షించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!

ఇది కూడా చూడండి: AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!

 

chaava review | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nabha Natesh: పరికిణీలో నభా అందాల జాతర.. చూస్తే ఫ్లాటే

గ్లామరస్ బ్యూటీ నభా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. సాంప్రదాయ కట్టు బొట్టులో నభా అందాలు ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.

New Update
Advertisment
Advertisment
Advertisment