Anil Ravipudi : అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్.. దగ్గుబాటి, నందమూరి హీరోలతో

డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈసారి ఆయన మరోసారి టాలీవుడ్‌లో ఇద్దరు హీరోల కాంబినేషన్లతో ఒక భారీ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేశారు.

New Update
anil

డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈసారి ఆయన మరోసారి టాలీవుడ్‌లో ఇద్దరు హీరోల కాంబినేషన్లతో ఒక భారీ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేశారు. ఇదివరకే వెంకీ(venkatesh) తో మూడు హిట్లు (F2, F3, సంక్రాంతికొస్తున్నాం) కొట్టిన అనిల్ మరోసారి ఆయనతోనే సినిమా చేయబోతున్నారు. ఇక తనకు దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన నందమూరి కల్యాణ్‌రామ్(Kalyan Ram) ఇందులో మరో హీరోగా నటిస్తున్నారు.

Also Read :  ‘ది కేరళ స్టోరీ2’ విడుదలపై కేరళ హైకోర్టు స్టే

Anil Ravipudi Next Movie With Venkatesh And Kalyan Ram

Also Read :  మొత్తానికి ఒక్కటైన విజయ్- రష్మిక.. 117 రూమ్స్.. నో ఫోన్స్.. పెళ్లిలో రూల్స్ ఇవే!

ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు అనిల్ స్పష్టం చేశారు. అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చే విషయం తెలిసిందే. టాలీవుడ్‌లోని రెండు పెద్ద కుటుంబాల హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

Advertisment
తాజా కథనాలు