/rtv/media/media_files/2025/03/17/8zEyq52Rol3O4xxxHvky.jpg)
Betting case registered against Bigg Boss contestants Vishnupriya and Tasty Teja
Vishnu Priya And Tasty Teja: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్(Online Betting App)లను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వరుసగా ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేస్తున్నారు. దొరికిన వారిని దొరికినట్లుగా కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఇప్పటికే లోకల్ బాయ్ నానిపై కేసు పెట్టి అరెస్టు చేశారు. అలాగే ఇటీవల భయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
11మంది సెలబ్రెటీలకు నోటీసులు
భయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ కూడా వేశారు. అదే క్రమంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన యూట్యూబర్లపై పోలీసులు వరుసగా కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరో 11 మంది సెలబ్రెటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్ విష్ణుప్రియ, టాలీవుడ్ నటి సురేఖా వాణి కూతురు సుప్రిత, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి, యూట్యూబర్ హర్షసాయి, బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ, యూట్యూబర్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ సహా తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక బిగ్ బాస్‌తో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విష్ణుప్రియ, టేస్టీ తేజలు ఇక జైలుకి వెళ్లడం ఖాయంలా కనిపిస్తుంది.
Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి
వారిద్దరికి నోటీసులు
ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంపై పోలీసులు మరింత ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. పంజాగుట్ట పీఎస్‌లో11మందిపై కేసు నమోదు అవ్వగా.. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్‌లు అయిన విష్ణుప్రియ, టేస్టీతేజకు తాజాగా పోలీసులు నోటీసులు పంపారు. ఈ రోజు సాయంత్రం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మరికొంత మంది పరారీలో ఉన్నారని సమాచారం. పరారీలో ఉన్న వారు తమ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.