Kannappa: వారందరికీ శివుడి శాపం తప్పదు: ‘కన్నప్ప’ మూవీ నటుడి షాకింగ్ వ్యాఖ్యలు

మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా ట్రోల్స్‌పై నటుడు రఘుబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కన్నప్ప మూవీపై ఎవరైనా ట్రోల్ చేసారంటే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవతారు. శివుడు ఎవ్వర్నీ వదిలిపెట్టడు. ట్రోల్ చేసిన ప్రతీ ఒక్కరు ఫినిష్ అవుతారు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

New Update
Raghu babu sensational comments manchu vishnu kannappa movie trolls

Raghu babu sensational comments manchu vishnu kannappa movie trolls

‘‘కన్నప్ప సినిమాపై ట్రోల్ కానీ విమర్శలు కానీ చేస్తే శివుడి ఆగ్రహానికి గురైపోతారు. ముఖ్యంగా శివుడి శాపం తప్పదు. ఎవరైనా, ఎంతటి వారైనా కన్నప్ప సినిమాపై ట్రోల్స్ చేస్తే.. శివుడు ఎవ్వరినీ వదిలి పెట్టడు. వందకు వందశాతం అందరీ ఫినిష్ అయిపోతారు.’’ అంటూ ఓ నటుడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అతడు ఎవరు, ఎందుకు ఇలాంటి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు అనే విషయానికొస్తే.. 

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం మంచు విష్ణు ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. దీనికోసం చాలా కష్టపడుతున్నాడు. ఇందులో స్టార్ క్యాస్టింగ్ భాగమవడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, మోహన్ బాబు వంటి సీనియర్ అండ్ యంగ్ హీరోలు సైతం ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఏప్రిల్ 25న గ్రాండె లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే పలు ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

శివుని శాపం తప్పదు

తాజాగా మంచు విష్ణు అండ్ టీమ్ మీడియాతో కాస్త ముచ్చటించింది. ఇందులో సీనియర్ నటుడు రఘుబాబు కూడా పాల్గొన్నారు. అనంతరం కన్నప్ప సినిమాపై వస్తోన్న ట్రోల్స్, విమర్శలపై రఘుబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నప్ప సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే.. శివుని ఆగ్రహానికి, శాపానికి గురవుతారు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!

 

ఇది వందకు వందశాతం. ప్రతి ఒక్కరూ.. ఎవ్వరైనా సరే ట్రోల్ చేశారంటే ఫినిష్ అయిపోతారు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీపై ఫస్ట్ నుంచే ట్రోల్స్ మొదలైన విషయం తెలిసిందే. 

( kannappa-movie | manchu-vishnu | actor-raghu-babu | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment