Chalasani Srinivas: ఏపీ విషమ పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ విషమ పరిస్థితుల్లో ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన గురించి చర్చించారు. By Karthik 16 Sep 2023 in గుంటూరు రాజకీయాలు New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ విషమ పరిస్థితుల్లో ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన గురించి చర్చించారు. అనంతరం చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీలో నేటి పాలకులు ఢిల్లీ చుట్టూ తిరిగే దౌర్భాగ్య పరిస్ధితి ఏర్పడిందన్నారు. ఉత్తరాధిన దిక్కులు పిక్కటిల్లేలా అరిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్రం అడుగులకు మడుగులొత్తుతున్నారనారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి నమ్మక ద్రోహం చేసి, నయవంచనకు గురి చేసిందని చలసాని శ్రీనివాస్ విమర్శించారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న విశాఖ ఉక్కు కార్మాగారం గురించి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. మరోవైపు సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. జగన్ చేసే కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపై పోరాటం చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రావడం లేదని చలసాని శ్రీనివాస్ అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వైసీపీని గద్దె దించే పనిలో నిమగ్నమై ఉన్నారని మండిపడ్డారు. ఇరువురు నాయకులు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని ఆయన హితువు పలికారు. రాష్ట్రం నాశనమైపోతోందన్న ఆయన.. నేతలు ఇతర పార్టీలపై కక్ష సాధింపుకు దిగకుండా రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుందో ఆ పార్టీని తుక్కుగా ఒడించాలని చలసాని పిలుపునిచ్చారు. మరోసారి ప్రత్యే క హోదాపై పోరాడే సమయం వచ్చిందన్న ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలల విద్యార్థులతో కలిసి పోరాటం చేయాలన్నారు. ఈ సారి మన లక్ష్యాలను నెరవేర్చే వరకు పోరాటాన్ని ఆపొదన్నారు. తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా నన్ను నమ్మండి అని ఒట్టు వేసిన ప్రధాని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలేదని చలసాని గుర్తు చేశారు. #pawan-kalyan #ycp #tdp #chandrababu #bjp #ap #narendra-modi #janasena #cpi #meeting #chalasani-srinivas #critical-situation #cm-ghajan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి