అప్పర్ సర్క్యూట్‌ను తాకిన వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్.. షేర్ ఎంత శాతం పెరిగిందంటే?

నేడు వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కంపెనీ నిన్న ప్రకటించిన వెంటనే నేడు వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ షేర్లు పెరిగాయి. దాదాపుగా 20 శాతం షేర్లు పెరిగినట్లు తెలుస్తోంది.

New Update
VRL Logistics

VRL Logistics Photograph: (VRL Logistics )

స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 93.92 పాయింట్లు తగ్గి 78,177.96 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 32.85 పాయింట్లు దగ్గర పడిపోయి 23,663 వద్ద ట్రేడ్‌ అవుతుంది. కొన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. మరికొన్ని నష్టాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, బీపీసీఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. శ్రీరామ్‌ ఫైనాన్స్‌, అపోలో హాస్పిటల్స్‌, ఐటీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు కాస్త నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 

ఇది కూడా చూడండి: గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!

ఇది కూడా చూడండి: JOBS: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..డిగ్రీ ఉంటే చాలు.. 

షేర్లు దాదాపుగా 20 శాతం..

నేడు మార్కెట్‌లో వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కంపెనీ నిన్న ప్రకటించగా.. నేడు షేర్లు దాదాపుగా 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇది రూ.466.25 నుంచి ప్రారంభమైంది. చివరకు రూ.538.5 వద్ద ట్రేడ్ అయ్యింది.

బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో 20 శాతం పెరిగి రూ.559.50 వద్ద అప్పర్ ప్రైస్ బ్యాండ్‌ను తాకింది. గతేడాది కాస్త నష్టాలను చవి చూసిన వీఆర్‌‌ఎల్ లాజిస్టిక్స్ నేడు కాస్త లాభాలను చూశాయి. వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 2 శాతం నుంచి 7 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం సమయంలో ఇదే త్రైమాసికంలో రూ. 736.67 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ. 825.22 కోట్లకు చేరుకుంది.

ఇది కూడా చూడండి: ఆపరేషన్ చేసిన స్టాప్‌నర్స్ కుట్లకు బదులు ఫెవిక్విక్‌ వాడితే.. చివరికి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు