ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్‌ను విడుదల చేయనున్నారు. 8వ సారి నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే నేడు నిర్మలమ్మ విడుదల చేసే బడ్జెట్ భారత చరిత్రలోనే అతి పెద్ద బడ్జెట్ అని తెలుస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది దాదాపు రూ.3లక్షల కోట్లు అదనంగా బడ్జెట్ విడుదల చేయనున్నారట. గతేడాది రూ.45,03,097 కోట్ల బడ్జెట్ విడుదల చేయగా.. నేడు రూ.50 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత్ పాండేతో పాటు కొందరు అధికారులతో కలిసి బడ్జెట్‌ను సిద్ధం చేశారు.
ఇది కూడా చూడండి: Karthikeya 3: కార్తికేయ-3 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
భారత్ ధనిక దేశం కావడానికి ఇది సరిపోదని..
ఇదిలా ఉండగా.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మనదేశ జీడీపీ గ్రోత్ 6.3-–6.8 శాతమే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ ధనిక దేశం కావడానికి ఇది సరిపోదని..రూల్స్ ను మరింత ఈజీ చేయాలని ఆమె అన్నారు. గ్రోత్ పెరగాలంటే భూ కార్మిక సంస్కరణల ఆవశ్యకత ఉందని ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే ఎనిమిది శాతం గ్రోత్ కావాలని ఆమె తెలిపారు.
ఇది కూడా చూడండి: Maha Kumbh mela: వీవీఐపీల పాస్ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!
ప్రపంచంతో పోటీ పడాలంటే క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మక సంస్కరణలు తేవాలని ఆర్థిక సర్వే చెప్పింది. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలని..ప్రస్తుతం ఉన్న చాలా నియంత్రణలు ఎత్తేయాలని అంది. అప్పులు తగ్గి ఆస్తులు పెరగాలి. ప్రైవేట్కన్సంప్షన్ , ఎఫ్‌డీఐలు కూడా పెరగాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గ్రోత్ రేట్‌ను కేంద్రం 6.4 శాతంగా అంచనా వేసింది.
ఇది కూడా చూడండి: Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం