/rtv/media/media_files/2025/02/12/RfNe97j6VCskofNZHyYX.jpg)
stock Markets shaking
Business: ట్రంప్(Trump) వస్తే అమెరికా(America)తో పాటూ ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుందని అందరూ ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు(Stock Market) సర్వనాశనం అయిపోతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అన్నట్టుగానే ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక...ఆయన తీసుకున్న నిర్ణయాల వలన ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. పెద్దన్న విధిస్తున్న సుంకాలకు విలవిల కొట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా మన బీఎ్‌సఈ సెన్సెక్స్, నిఫ్టీ50 కుదేలై.. ఈక్విటీ ఇన్వెస్టర్లు ఐదంటే ఐదు రోజుల్లో రూ.16.97 లక్షల కోట్లు నష్టపోయారు. 22 రోజుల్లో రూ.23 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. రోజుకు సగటున లక్ష కోట్లకు పైగా లాస్ అవుతూందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.
20 రోజుల్లో రూ.23 లక్షల కోట్లు..
ట్రంప్ రాకతో ఈక్విటీ షేర్లు, మార్కెట్లకు గట్టి దెబ్బ కొట్టింది. సర్లే వచ్చిన కొత్తల్లోనే ఈ నిర్ణయాలు ఉంటాయి. వారం, పది రోజుల తర్వాత అంతా మామూలు అయిపోతుందని అనుకున్నారు అంతా. కానీ ట్రంప్ వచ్చి 20 రోజులు అవుతున్నా ఎక్కడా తగ్గడం లేదు. ఇంకా రోజుకు రెండు, మూడు నిర్ణయాలతో దుళ్ళగొడుతున్నారు. తన, మన అనే తేడా లేకుండా పలు దేశాల, పలు ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల కొరడా ఝుళిపిస్తుండడంతో ప్రపంచం యావత్తూ బెంబేలెత్తిపోతోంది. దీని వలన ఒక్క అమెరికా స్టాక్ మార్కెట్టే కాదు...అటు ఆసియా, ఇటు ఇండియా మార్కెట్లు కూడా బేర్ మంటున్నాయి. మదుపర్ల డబ్బులు కోట్లలో ఆవిరి అయిపోతున్నాయి. ట్రంప్ బాధ్యతలు తీసుకున్న రోజు జనవరి 20 నుంచి ఈరోజు వరకు అంటే 22 రోజుల్లో సెన్సెక్స్ 779.84 పాయింట్లు, నిఫ్టీ 272.95 పాయింట్లు నష్టపోయాయి. దీంతో ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23.07 లక్షల కోట్లకు పైగా పడిపోయాయి. జనవరి 20న రూ.431.59 లక్షల కోట్లున్న మార్కెట్ విలువ నిన్న మార్కెట్ ముగిసే సమయానికి రూ.408.52 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు రూ. 23లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి అన్నమాట. ఇక చిన్న, మధ్యశ్రేణి కంపెనీల షేర్లయితే 40 శాతం వరకు దిగజారాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Manipur: మణిపూర్ సీఎం రాజీనామా.. తర్వాత రాష్ట్రపతి పాలన?
Also Read: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!