/rtv/media/media_files/2025/02/07/Gu5udhAGjWKt2N4Guxya.jpg)
jio cheapest recharge plans announced
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) గతేడాది భారీగా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచి తమ యూజర్లకు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జియో సిమ్ కార్డు యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్ట్ అవ్వడం ప్రారంభించారు. దీంతో టెలికాం కంపెనీ మళ్లీ తమ యూజర్లను రప్పించుకునేందుకు.. అలాగే కొత్త యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు రోజుకో కొత్త ఆఫర్‌ను ప్రకటిస్తుంది.
ఇది కూడా చూడండి: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?
తాజాగా అలాంటి ఆఫర్లే ప్రకటించింది. పలు రీఛార్జ్ ప్లాన్‌లపై (Recharge Plans) భారీ ప్రయోజనాలను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 5జీ అన్‌లిమిటెడ్ డేటా, ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోసం చూసే వారికి ఇది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
రూ.349 ప్లాన్
జియో రూ.349 ప్లాన్‌లో యూజర్లు 28 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్‌లో డైలీ 2జీబీ డేటా వస్తుంది. అలాగే 5జీ అన్‌లిమిటెడ్ డేటా కూడా పొందొచ్చు. వీటితోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ ఎస్ఎమ్ఎస్‌లతో పాటు మరెన్నో ప్రయోజనాలు లభిస్తాయి.
ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే
రూ.749 ప్లాన్
జియో నుంచి రూ.749 ప్లాన్ అధిక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ధరతో రీఛార్జ్ చేసుకుంటే.. 72 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అంటే దాదాపు 2నెలలకు పైగా అన్నమాట. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 2జీబీ డేటా వస్తుంది. 5జీ అన్‌లిమిటెడ్ డేటా కూడా పొందొచ్చు. దీంతోపాటు బోనస్‌గా మరో 20జీబీ అదనపు 4జీ డేటా లభిస్తుంది. 72 రోజులు అయ్యేంత వరకు దీనిని వాడుకోవచ్చు. అందువల్ల మంచి డేటా ప్లాన్ కోసం చూస్తే ఇదే ది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు.
ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్ గ్యాప్ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?
రూ.3599 ప్లాన్
నెల నెల ఎందుకు.. ఏడాది ప్లాన్ కోసం చూసేవారికి రూ.3599 ప్లాన్ అందుబాటులో ఉంది. 365 రోజుల వ్యాలిడిటీతో ఇది వస్తుంది. ఈ ప్లాన్‌లో డైలీ 2.5జీబీ 4జీ డేటాతో సహా 5జీ అన్‌లిమిటెడ్ డేటా వస్తుంది. అపరమిత వాయిస్ కాల్స్ పొందొచ్చు. అందువల్ల ఇంకా అధిక డేటా వాడే వారికి ఇది మరింత బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.