/rtv/media/media_files/M6yGrZe9uIjCB6nwhgSb.jpg)
షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ ను లాభాల దిశగా నడిపిస్తున్నాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగి 76,100 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 23,050 దగ్గర ట్రేడ్ అవుతోంది. దానికి తోడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం కూడా మదుపర్లు ఎదురుచూస్తున్నారు. సెన్సెక్స్ 30 స్టాక్‌లలో 22 పెరగ్గా.. 8 క్షీణించాయి. ఇన్ఫోసిస్, జొమాటో, టెక్ మహీంద్రా, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, టైటాన్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Also Read: దేశంలో బీజేపీ పార్టీనే రిచ్..పార్టీ ఖాతాలో రూ.7 వేల కోట్లు
డీప్ సీక్ భయం..
ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 0.54 శాతం పైకెగిసింది. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ ఇండెక్స్, కొరియా యొక్క కోస్పి ఈరోజు మూసివేయబడ్డాయి. చైనా ఏఐ డీప్ సీక్ స్టాక్ మార్కెట్ ను బాగానే భయపెట్టింది. దీని కారణంగా సోమవారం అమెరికా, భారత్, ఆసియా మార్కెట్లు సైతం భారీగా పతనమయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ.4,921 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇది కూడా చూడండి: Cinema: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం..ఫిల్మ్ ఛాంబర్