/rtv/media/media_files/2025/02/11/yRfB1iBsYU7oeHCYb0ju.jpg)
Stock Market On Monday
ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడు అయిన దగ్గర నుంచీ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఒడిదుడుకులకు గురవుతూనే ఉన్నాయి. ఒకరోజు లాభాల్లో ఉంటే పదిరోజులు నష్టాల్లో ఉంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దేశీ మార్కెట్ల వరకూ అన్నీ నష్టాలనే చవిచూస్తున్నాయి. ఈరోజు ఉదయం కూడా 9:26 సమయానికి నిఫ్టీ 96 పాయింట్లు నష్టపోయి 22,852కు చేరింది. సెన్సెక్స్ 322 పాయింట్లు దిగజారి 75,653 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల కారణంగా దేశీ మార్కెట్లో సూచీలు ఒడిదుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం లాంటి షేర్ల అమ్మకాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 19 లాభపడగా.. 12 నష్టపోయాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 33 నష్టపోయాయి.. 17 లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లో కొరియా కోస్పి 1.93% పెరిగింది. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 0.50%, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.54% పెరిగాయి.
Also Read: Supreme Court: భారత్ లో యూట్యూబ్ కు కళ్ళెం..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
Also Read : Gold Prices: బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త...వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు!
బీఎస్ఈలో రూ.81 లక్షల నష్టం
మరోవైపు స్టాక్ మార్కెట్ల పతనంతో బీఎస్ఈ మార్కెట్ విలువ పడిపోయింది. ప్రస్తుతం దీని విలువ రూ. 400 లక్షల దిగువకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే రూ.2.10 లక్సల కోట్లు హరించుకుపోయాయి. గతేడాది సెప్టెంబర్ 27న జీవితకాల గరిష్టం రూ.479 లక్షల కోట్లకు చేరుకున్న బీఎస్ఈ ఇప్పుడు ఏకంగా రూ. 81 లక్షల కోట్లు నష్టపోయింది.
Also Read : BSNL New Recharge Plan: ఏంటి భయ్యా నిజమా.. రూ.1500 లకే 365 రోజుల వ్యాలిడిటీ- డైలీ 2జీబీ డేటా!
Also Read : Indigo Valentines Day Sale: లవర్స్‌కు ఇండిగో కిక్కిచ్చే రొమాంటిక్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే!