/rtv/media/media_files/2025/02/01/9EsW9Qsw4Gd7Cmk8EYFX.webp)
stock market
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 73,354 వద్ద ఉంది. నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 22,179 వద్ద కొనసాగింది. అయితే నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 87.28గా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. నేడు నిఫ్టీ సూచీలో శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. యాక్సిక్ బ్యాంక్, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, సిప్లా షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.
ఇది కూడా చూడండి: ఐదో సారి తల్లి కాబోతున్న సీమా హైదర్... తండ్రిగా సచిన్ మీనాకు ప్రమోషన్ !
కనిష్ట స్థాయికిి చేరుకున్న స్టాక్‌లు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో పాటు మరో తొమ్మిది స్టాక్‌లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్ ఇండెక్స్ 2.15% వరకు క్షీణించింది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యుకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ లాగార్డ్స్‌గా నిలిచాయి.
ఇది కూడా చూడండి: Oscar Awards 2025 : ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!
బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేర్లు 1.24 తగ్గి.. రూ.679.65కి చేరుకున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 2.3 శాతం తగ్గి రూ.197.70కు చేరుకున్నాయి. పీఎన్‌బీ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయి రూ. 85.51కి చేరుకోగా, కెనరా బ్యాంక్ షేర్లు రూ. 78.58 కి పడిపోయాయి. ఇక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టాక్ అయితే 5.6 శాతం తగ్గి తగ్గి రూ. 41.10కి చేరుకుంది.
ఇది కూడా చూడండి: Blankets: దుప్పట్లు వాసన వస్తున్నాయా.. ఇలా చేస్తే సువాసన వెదజల్లుతాయి