ఈ మధ్య వారం రోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాలు చూస్తున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే సూచీలు ఈరోజు ఉదయం లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం మార్కెట్ మొదలయ్యే సమయానికి సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు పెరిగి 76,500 స్థాయిలో.. నిఫ్టీ కూడా 50 పాయింట్లు పెరిగి 23250 స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ సూచీల్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జొమాటో, టైటాన్, టాటాస్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండా..బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో దూసుకెళుతున్నాయి.
లాభనష్టాల్లో విదేశీ మార్కెట్లు
మరోవైపు అమెరికా మర్కెట్లు మాత్ర డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. అక్కడ రోజు ముగిసేసరికి అమెరికా డౌ జోన్స్ 0.027% తగ్గి 41,953 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.33%, ఎస్ అండ్ పి 500 ఇండెక్స్ 0.22% పడిపోయాయి. ఇక ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే జపాన్ నిక్కీ 0.37% పెరిగింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 1.67% తగ్గింది. చైనా షాంఘై కాంపోజిట్ 0.68% తగ్గింది. నిన్న విదేశీ పెట్టుబడిదారులు రూ.3,239.14 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ పెట్టుబడిదారులు రూ.3,136.02 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.