/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stock-1-jpg.webp)
Stock Market
ఐదు నెలలుగా నష్టాలతో చావు దెబ్బ కొడుతున్న స్టాక్ మార్కెట్ లో అప్పుడప్పుడూ లాభాలు అలా వచ్చి పలకరించి వెళుతున్నాయి. ఆ ఒక్కరోజు మాత్రం మదుపర్లు పండగ చేసుకుంటున్నారు. ఈరోజు అలాంటి అవకాశమే వచ్చింది మళ్ళీ. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభం అయిన దగ్గర నుంచీ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,500 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది.
స్వల్ప లాభాల్లో సూచీలు..
ఈరోజు గురువారం స్టాక్ మార్కెట్ కాస్త కన్నుల పండుగగా ఉంది. ఉయం నుంచి సూచీలు లాభాల్లో ట్రేడవుతుండడంతో మదుపర్ల మొహాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయం తరువాత సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 74,150 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 22,494 దగ్గర ఉంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 18 లాభపడగా.. 12 నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 1.52%, జొమాటో 1.39%, ఎయిర్‌టెల్ షేర్లు 1.36% పెరిగాయి. కాగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 0.12% తగ్గాయి. అలాగే నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 38 లాభాల్లో, 7 నష్టాల్లో ఉండగా, 5 మారకుండా యథాస్థానంలో ట్రేడవుతున్నాయి. NSEలో మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్ పెరిగ్గా.. మీడియా రంగం షేర్లు 1% వరకు క్షీణించాయి.
అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 0.49 శాతం, నాస్‌డాక్ 1.22 శాతం లాభపడగా.. డోజోన్స్ 0.20 శాతం నష్టపోయింది. రష్యా, ఉక్రెయిన్ సీజ్ ఫైర్ కూడా మార్కెట్ల ఎదుగుదలకు సహాయపడుతోంది. సీపీఎస్ఈ, పీఎస్ఈ, ఎనర్జీ, చమురు, పీఎస్ యూ బ్యాంకు, ఇన్ఫ్రా, కమోడిటస్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు ఆసిా మార్కెట్లు కడా జోరు మీదున్నాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 0.96% లాభంతో, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 0.17% లాభంతో ట్రేడవుతున్నాయి. కాగా, చైనా షాంఘై కాంపోజిట్ 0.052% తగ్గింది. నిన్న విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) రూ.1,627.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ కాలంలో దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) రూ.1,510.35 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
Also Read: Bengaluru: యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా..రన్యారావు స్టేట్ మెంట్