/rtv/media/media_files/2024/11/27/8hq0OFDoetmyj7gItFuz.webp)
Stock Market Today
విపరీత నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్లు నిన్నా, ఇవాళ లాభాలతో కళకళలాడుతున్నాయి. నిన్న ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. దానిని కొనసాగిస్తూ ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 73,807 దగ్గర... నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 22,366 దగ్గర ఉన్నాయి.
అన్నిచోట్లా సానుకూల ఫలితాలు..
అంతర్జాతీయంగా కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డోజోన్స్ 1.14 శాతం, ఎస్‌అండ్‌పీ సూచీ 1.12 శాతం, నాస్‌డాక్ 1.46 శాతం లాభంతో ముగిశాయి. ఇక ఆసియా, పసిఫిక్ మార్కెట్లు కూడా భారత మార్కెట్ల బాటలోనే పయనిస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 0.82%, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 2.58% చొప్పున పెరిగాయి. చైనా షాంఘై కాంపోజిట్ 1.05% పెరిగింది. మార్చి 5న విదేశీ పెట్టుబడిదారులు రూ.2,895 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ కాలంలో దేశీయ పెట్టుబడిదారులు రూ.3,370 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
Also Read: Mumbai: ట్విన్ టన్నెల్ పిటిషన్ పై రోజంతా వాదనలు..పిల్ ను రిజర్వ్ చేసిన బాంబే హైకోర్ట్
ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మెటల్, ఆటో ప్రభుత్వ బ్యాంకుల షేర్లలో పెరుగుదల కనిపిస్తోంది. నిఫ్టీ మెటల్, ఆటో, రియాల్టీ, పిఎస్‌యు బ్యాంక్ సూచీలు దాదాపు 0.5% పెరిగాయి. మీడియాలో దాదాపు 1% పెరుగుదల ఉంది. చమురు & గ్యాస్ సూచిక దాదాపు 1.50% పెరిగ్గా.. ఐటీ, ఎఫ్‌ఎంసిజి సూచీలు స్వల్పంగా తగ్గాయి. టాటా స్టీల్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు దాదాపు 2% పెరిగాయి. అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Also Read: USA-India: ఏప్రిల్ 2 నుంచి భారత్ పై ప్రతీకార సుంకాలు..సపోర్ట్ చేసిన జైశంకర్