/rtv/media/media_files/2025/02/20/kjdpS8xSxC54joCrnUuH.jpg)
Pearl Global Stocks
ఎప్పటిలాగే ఈరోజు స్టాక్ మార్కెట్లు (Stock Markets) నష్టాలనే చూస్తున్నాయి. నేడు ఏకంగా సెన్సెక్స్ 400 పాయింట్ల పడిపోయి 75 వేల 500 మార్కు వద్ద కదలాడుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా 100 పాయింట్లు తగ్గి 22 వేల 800 మార్కు ఎగువన ఉంది. పెద్ద స్టాక్స్ కూడా ఢమాల్ అంటున్నాయి. తాజాగా ఫార్మా స్టాక్స్ భారీగా పడిపోయాయి. అమెరికా అధ్యక్షుడు కొడుతున్న దెబ్బలకు స్టాక్ మార్కెట్ కుదేలవుతోంది. విదేశీ పెట్టుబడులు అన్నీ తరలిపోతున్నాయి. దీంతో మార్కెట్లు మరీ నేలచూపులు చూస్తున్నాయి.
Also Read : సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?
మంచి రిటర్స్న్ ఇస్తున్న పెర్ల్ గ్లోబల్..
అయితే ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో కొన్ని స్టాక్స్ మాత్రం దలాల్ స్ట్రీట్ లో మదుపర్లుకు కాసుల పంట పండిస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ (Global Industries Ltd Stock) అన్నింటికంటే ముందుంది. దీనిలో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి రిటర్న్స్ వస్తున్నాయి.
Also Read : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. బస్సుల్లో పదిశాతం రాయితీ
Also Read : మొదటి మ్యాచ్ లోనే చిత్తు అయిన ఆతిథ్య జట్టు..
ఐదేళ్ల కిందట పెర్ల్ గ్లోబల్ స్టాక్ ధర రూ.60 దగ్గర ఉండేది. ఇప్పుడు దాని ధర రూ. 1435కు పెరిగింది. అంటే దాదాపు 2291శాతం దీని వాల్యూ పెరిగిందన్నమాట. దాంతో దీని మీద రిటర్న్స్ కూడా భారీగా అందాయి. ఈ స్టాక్ ధర రూ. 47 నుంచి ప్రస్తుత స్థాయికి పెరిగింది. దీనివలన ఇన్వెస్టర్లు ఏకంగా 3 వేల శాతం లాభాలు అందుకున్నారు. అంటే రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారి చేతికి రూ. 31 లక్షలు వచ్చాయన్నమాట. దాదాపు ప్రతీ ఏడు పెర్ల్ గ్లోబల్ స్టాక్ స్థిరంగా, నిలకడగా రాణిస్తూ వస్తోంది. అందువల్లనే దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లు ఈ స్టాక్ వలన మంచి రిటర్న్స్ అందుకుంటున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 2023 క్యాలెండర్ ఇయర్‌లో ఈ స్టాక్ ధర ఏకంగా 217 శాతం పుంజుకుంది. 2022లో 17 శాతం, 2021లో 74 శాతం పెరిగింది. ఇక 2020 సంవత్సరంలో 29 శాతం పెరగ్గా.. 2019లో 15 శాతం పెరిగింది. ఇప్పటివరకు ఈ ఏడాదే కాస్త తక్కువగా ఉంది. పెర్ల్ గ్లోబల్ ఒక వస్త్ర పరిశ్రమ. డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్‌లో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 6.70 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 1717 కాగా.. కనిష్ట ధర రూ. 524.20 గా ఉంది.
Also Read: China: చైనా దుందుడుకు చర్య..ఫిలిప్పీన్స్ విమానాన్ని గుద్దేస్తామంటూ ఆట్లాట