March Bank Holidays: తెలుగు రాష్ట్రాల్లో 14 రోజులు బ్యాంకులు బంద్

మార్చి నెలలో సెలవులు జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులు, శనివారాలు, ఆదివారాలు అన్నింటిని కలిపి లిస్ట్‌ను ఆర్‌బీఐ ప్రకటించింది.

New Update
RBI

Bank Holidays

మార్చి నెలలో సెలవులు జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉన్నాయి. ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులు, శనివారాలు, ఆదివారాలు అన్నింటిని కలిపి లిస్ట్‌ను ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ సెలవులు జాబితాను షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు అన్ని కూడా పాటిస్తాయి. అయితే ఈ మార్చి నెలలో బాంకుల సెలవుల లిస్ట్ ఏదో చూద్దాం.

ఇది కూడా చూడండి: SLBC: డాక్టర్‌గా చెబుతున్నా.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన!

March Bank Holidays List

మార్చి 2 (ఆదివారం) - వారాంతం సెలవు
మార్చి 7 (శుక్రవారం) - మిజోరంలో బ్యాంకులకు సెలవు
మార్చి 8 (రెండవ శనివారం) - వారాంతపు సెలవు
మార్చి 9 (ఆదివారం) - వారాంతపు సెలవు

ఇది కూడా చూడండి: Crime: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!

మార్చి 13 (గురువారం) - హోలికా దహన్, అట్టుకల్ పొంగల్ కారణంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళలో బ్యాంకులకు సెలవులు 
మార్చి 14 (శుక్రవారం) - హోలీ సందర్భంగా త్రిపుర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాల్లో సెలవు
మార్చి 15 (శనివారం) - అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలో బ్యాంకులు మూసివేత
మార్చి 16 (ఆదివారం) - వారాంతపు సెలవు
మార్చి 22 (నాల్గవ శనివారం)- వారాంతపు సెలవు

ఇది కూడా చూడండి: Viral Video: ఎవర్రా మీరంతా.. ఇండియాలో ఇద్దరు మగాళ్ల పెళ్లి.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన తల్లిదండ్రులు!

మార్చి 23 (ఆదివారం) - వారాంతపు సెలవు
మార్చి 27 (గురువారం)- షబ్-ఎ-ఖాదర్ కారణంగా జమ్మూలో బ్యాంకులకు సెలవు
మార్చి 28 (శుక్రవారం)- జుమాత్-ఉల్-విదా కారణంగా జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
మార్చి 30 (ఆదివారం) - వారాంతపు సెలవు
మార్చి 31 (సోమవారం) - రంజాన్-ఈద్ కారణంగా మిజోరాం, హిమాచల్ ప్రదేశ్‌లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు