/rtv/media/media_files/2024/12/08/QYPSUUcJiDttypi02sV8.jpg)
LIC key announcement to customers for LIC Fake apps
LIC Big Alert: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీదారులకు కీలక సూచన చేసింది. LIC పేర్లతో నకిలీ యాప్స్ సర్కూలేట్ అవుతున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. పాలసీ దారులు ఫేక్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆఫర్లు చూసి మాయగాళ్ల వలలో పడొద్దని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..
LIC పేరు మీద నకిలీ మొబైల్ యాప్స్..
ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసిన బీమా సంస్థ.. LIC ఇండియా పేరు మీద నకిలీ మొబైల్ యాప్స్ సర్యూలేట్ అవుతున్నట్లు గుర్తించాం. పాలసీహోల్డర్లు, కస్టమర్లు వీటిపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. LIC ఇండియా అధికారిక వెబ్‌సైట్, LIC డిజిటల్ యాప్, LIC వెబ్‌సైట్‌లో మాత్రమే లావాదేవీలు జరపాలని సూచించింది. ఇక ఫేక్ యాప్స్ ద్వారా ట్రాన్సక్షన్ చేస్తే ఎల్‌ఐసీ ఎలాంటి సంబంధం లేదని, వాటికి ఎలాంటి బాధ్యత వహించబోమని క్లారిటీ ఇచ్చింది. అధికారిక వెబ్‌సైట్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని లావాదేవీలు కొనసాగించాలని కోరింది.
ఇది కూడా చదవండి: Mulugu SI: తెలంగాణలో మరో ఎస్సై బలవన్మరణం.. డిపార్ట్‌మెంట్‌లో కలకలం!
బీమా సఖి యోజనకు భారీ ఆదరణ..
ఇదిలా ఉంటే.. మహిళల కోసం తీసుకొచ్చిన బీమా సఖి యోజనకు దేశవ్యాప్తంగా భారీ ఆదరణ లభిస్తోందని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ గత డిసెంబరులో హర్యానా పానిపట్లో యోజనను ప్రారంభించగా ఇప్పటివరకు 52,511 రిజిస్ట్రేషన్లు అయినట్లు వెల్లడించింది. 27,695 అపాయింట్మెంట్ లెటర్లు కూడా జారీ అయ్యాయని, హైదరాబాద్ జోనల్ మేనేజర్పునీత్ కుమార్ తెలిపారు. అలాగే సౌత్ సెంట్రల్ జోన్లో 12,201 అప్లికేషన్లు వచ్చాయి. 6,284 మందికి అపాయింట్మెంట్లెటర్లు ఇచ్చాం. 3 వేల మంది స్టైపైండ్ తోపాటు పాలసీల అమ్మకాలపై కమీషన్ పొందుతున్నారు. 10వ తరగతి పాసై 18–70 మధ్య వయసున్న మహిళలందరూ బీమా సఖిలో చేరవచ్చు. 3 ఏళ్ల పాటు నెలకు రూ.3 వేల చొప్పున స్టైపెండ్ ఇస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: IND VS ENG : కోహ్లీకి గాయం.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలింగ్
Also Read: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?