/rtv/media/media_files/2025/03/06/0u8v5023AV4MdHEw4DJk.jpg)
Jio Star Photograph: (Jio Star)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన వయాకామ్ 18, వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియాలు కలిసి జియోస్టార్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇందులో 1,100 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. గత నెల కిందటే తొలగింపుల ప్రక్రియ ప్రారంభమైందని, జూన్ వరకు ఇవి కొనసాగనున్నట్లు సమాచారం. ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్, కమర్షియల్, లీగల్ విభాగాల్లో ఉన్నవారిపై కంపెనీ వేటు వేస్తుంది.
ఇది కూడా చూడండి: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
The @RJioStar layoffs started last month and are expected to continue until June. The cuts will primarily affect corporate roles, including entry-level employees, senior managers, senior directors, and assistant vice presidents.
— Outlook Business (@outlookbusiness) March 6, 2025
Read more: https://t.co/kpFCAPBX6o#JioStar…
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
సీనియర్ డైరెక్టర్ల ఉద్యోగాలపై వేటు..
ఎంట్రీ లెవల్ ఉద్యోగులతో పాటు సీనియర్ మేనేజర్లు, సీనియర్ డైరెక్టర్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులపై కూడా వేటు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఉద్యోగులకు వివిధ ప్యాకేజీలను అందిస్తుంది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నందున చెల్లింపు విధానంలో సర్వీస్ చేసిన సంవత్సరాల బట్టి వేతనం ఇస్తోంది. కొందరికి ఆరు లేదా 12 నెలల వేతనాన్ని అందిస్తుంది. కొందరు ఉద్యోగులకు నోటిస్ పీరియడ్ కూడా ఇస్తుంది. అయితే జియో స్టార్ నుంచి తొలగించిన ఉద్యోగులకు జియో, రిలయన్స్‌లో ఉద్యోగులు ఇవ్వచ్చని చర్చ సాగుతోంది.
ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!