/rtv/media/media_files/2025/02/20/lC3GcXKJVbWXrFOrL2qQ.jpg)
new iphone 16e Photograph: (new iphone 16e )
యాపిల్ కంపెనీ ఇండియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా 16 సిరీస్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. 16e అనే కొత్త వేరియంట్ మొబైల్‌ను యాపిల్ సడెన్‌గా రిలీస్ చేసింది. దాని ఫీచర్స్, ధర లను కూడా వెల్లడించింది. ఈ ఫోన్‌లో ఎన్నో ఫీచర్స్ తక్కువ ధరకే అందిస్తోంది యాపిల్ కంపెనీ. కంపెనీ ఓనర్ టిమ్ కుక్ బుధవారం 16 ఫ్యామిలీలో కొత్త మెంబర్ 16e అంటూ Xలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 16 సిరీస్ అంటే ఇప్పుడున్న టాప్ ఎండ్. తక్కువ బడ్జెట్‌లో ఈ 16 సిరీస్ ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. దీని స్పెషల్ డిజైన్ ప్రో, ప్రో మ్యాక్స్‌లకు ఏ మాత్రం తగ్గదు.
Also Read : ఏఐజీ హాస్పిటల్‌కు KCR
New Apple iPhone 16e
Meet iPhone 16e, the newest member of the iPhone 16 family! #AppleLaunch pic.twitter.com/q9BHWxdYtN
— Tim Cook (@tim_cook) February 19, 2025
ఐఫోన్ 16 మాదిరిగానే అత్యాధునిక 3nm A18 బయోనిక్ చిప్‌తో ఆధారితమైన ఐఫోన్ 16e ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌తో కూడా వస్తుంది. యాక్షన్ బటన్, USB టైప్ C ఛార్జింగ్, అన్‌లాకింగ్ కోసం ఫేస్‌ఐడి, 5.3, NFC, Wi-Fi 6 లాంటి కీ ఫీచర్స్ 16eలో కూడా అందుబాటులో ఉంది.
Also read : సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?
ఐఫోన్ 16e భారతదేశంలో రూ.59,900 నుంచి లభించనుంది. ఇది 128, 256, 512 మూడు స్టోరేజ్ వేరియంట్‌లతో క్లాసిక్ బ్లాక్ అండ్ వైట్ రెండు కలర్స్‌లో తయారు చేశారు. 16e ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే కలిగి ఉంది. అంతేకాదు 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 800 నిట్స్ బ్రైట్‌నెస్ ను కొత్త మోడల్‌లో అందిస్తోంది యాపిల్ కంపెనీ. ఐఫోన్ 16e సింగల్ బ్యాక్ కెమోరాతో వస్తోంది. అందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాను 16eకు యాడ్ చేశారు.
Also Read : ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!
Also Read : కుంభమేళాలో అలా చేసిన వారిపై కఠిన చర్యలు.. పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్