Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

New Update
Infosys won't cut jobs despite AI shift, says CEO Salil Parekh

Infosys won't cut jobs despite AI shift, says CEO Salil Parekh

Infosys: ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది. రాబోయే రోజుల్లో కొత్త నియామకాలు, నైపుణ్యాల పెంపుపైనే ఫోకస్ పెడతామని పేర్కొంది. తాజాగా ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్ ఇంటర్వ్యూలో దీని గురించి క్లారిటీ ఇచ్చారు. గతేడాది తమ కంపెనీలో లేఆఫ్‌లు చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగ తొలగింపు ప్రక్రియ ఉండదని స్పష్టం చేశారు. 

Also Read: తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణలు.. విజయ్‌కు అమిత్ షా ఫోన్ !

ప్రస్తుతం ఏఐ రావడంతో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాల్లో పలు మార్పులు ఉంటాయని.. ఏఐ వల్ల వర్క్ పరిధి మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఏఐ వల్ల తమ సంస్థలో ఉద్యోగాల కోతలు ఉండవన్నారు. ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని తమ ఉద్యోగులకు ఆ నైపుణ్యాల్లో మరింత ట్రైనింగ్ ఇవ్వనున్నామని తెలిపారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇన్ఫోసిస్‌.. కనీసం 20 వేల మంది ఫ్రెషర్లను తీసుకునే ప్లాన్‌లో ఉందని ఇటీవలే ఆ సంస్థ ప్రకటన చేసింది. 

Also Read: పశ్చిమ బెంగాల్‌లో TMCదే అధికారం.. సునీల్‌ మౌర్య సంచలన సర్వే

మరోవైపు గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, అమెజాన్ లాంటి టెక్ కంపెనీల్లో మాత్రం లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ఏకంగా 30 వేల ఉద్యోగాలను తొలగించడం టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. ఏఐ సేవల కోసం బడా కంపెనీలు డేటా సెంటర్లు, ఇతర మౌలిక సదుపాయల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా కంపెనీలు ఖర్చులు తగ్గుంచుకునేందుకు లేఆఫ్‌లు చేస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు