Sundar Pichai: ఆంథ్రోపిక్‌ ఏఐ టూల్‌పై భయపడాల్సిన పని లేదు.. సుందర్ పిచాయ్‌ కీలక ప్రకటన

ఆంథ్రోపిక్‌పై గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్‌ తొలిసారిగా స్పందించారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్, యూబ్యూట్ లాగే ఏఐ కూడా ఓ సాధారణ సపోర్టింగ్ టూల్ అని అన్నారు.

New Update
Sundar Pichai

Sundar Pichai

ఇటీవల అమెరికా ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్‌ కొత్త ఏఐ టూల్‌ను విడుదల చేయడంతో టెక్‌ కంపెనీలు ఆందోళనకు గురయ్యాయి. అయితే ఆంథ్రోపిక్‌పై గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్‌ తొలిసారిగా స్పందించారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్, యూబ్యూట్ లాగే ఏఐ కూడా ఓ సాధారణ సపోర్టింగ్ టూల్ అని అన్నారు. దానిపై అనవసర భయాలు ఉన్నాయని.. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. సాంకేతికతను తమ ప్రయోజనాలకు తగ్గట్లు వాడటం కంపెనీలకు ఇది మరో చక్కటి అవకాశమని తెలిపారు. 

మరోవైపు ఎన్విడియా CEO జెన్సెన్‌ హువాంగ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను ఏఐ మరింత మెరుగుపరుస్తుందన్నారు. కానీ వాటిని ఏఐ భర్తీ చేయలేదని తెలిపారు. క్లిష్టమైన పనుల్లో ఉద్యోగులు దీన్ని వినియోగించుకుకోవచ్చని చెప్పారు. దీనివల్ల టార్గెట్లు ఈజీగా పూర్తవుతాయన్నారు.  

Also Read: ఆ చర్చలు ఫెయిల్ అయితే ఇరాన్‌పై దాడులు చేస్తాం.. అమెరికా సంచలన వార్నింగ్

ఇటీవల ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన ఏఐ టూల్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్, లీగల్ టెక్‌, ఫైనాన్షియల్ సర్వీసెస్‌ కంపెనీల షేర్లు పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే ఈ రంగాల్లో 285 బిలియన్ డాలర్ల సంపద పతనమయ్యింది.  సీకం పైలర్‌ను రూపొందించే క్లాడ్‌ ఓపస్‌ 4.6 మోడల్‌ను ఆంథ్రోపిక్‌ రిలీజ్ చేసింది. 16 క్లాడ్‌ ఏఐ ఏజెంట్లు కలిసి సీకం పైలప్‌పై ప్రయోగాలు జరిపితే ఫలితాలు వచ్చినట్లు ఆ సంస్థ చెప్పింది. ఈ ఏజెంట్లు కేవలం రెండ్రోజుల్లోనే లక్ష లైన్ల కంపైలర్‌ను సృష్టించినట్లు పేర్కొంది. 

వాస్తవానికి సీకంపైలర్ అనేది ఓ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్. ఇది సీ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో రాసిన సోర్స్‌ కోడ్‌ను మెషిన్‌రీడబుల్ ఫార్మాట్‌లోకి మార్చేస్తుంది. ఈ ఆదేశాలను కంప్యూటర్ CPU అర్థం చేసుకుని ఎగ్జిక్యూట్‌ చేస్తుంది. దీంతోనే కంప్యూటర్లు బైనరీ కోడ్‌లో ఆదేశాలు స్వీకరిస్తాయి. అయితే చాలా క్లిష్టమైన ప్రోగ్రామ్‌ అని టెక్ నిపుణులు అంటున్నారు. కానీ ఈ ప్రక్రియను ఏఐ సొంతంగా రూపొందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also Read: అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. సంతకాలు జరిగేది అప్పుడే : పియూశ్‌ గోయల్

Advertisment
తాజా కథనాలు